Sajjala Bhargava Reddy: సజ్జల భార్గవ్‌కు షాకిచ్చిన పోలీసులు.. పులివెందులలో కేసు నమోదు.. ఎందుకంటే?
సోషల్ మీడియాలో దూషణలకు పాల్పడుతూ పోస్టులు పెడుతున్న వారిపై కూటమి ప్రభుత్వం కొరడా ఝుళిపిస్తున్న విషయం తెలిసిందే.

Sajjala Bhargav
Sajjala Bhargav: వైసీపీ హయాంలో ప్రభుత్వ సలహాదారుగా పనిచేసిన ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు, వైసీపీ సోషల్ మీడియా ఇంఛార్జి సజ్జల భార్గవ్ రెడ్డిపై కడప జిల్లా పులివెందులలో ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. హరి అనే యువకుడి ఫిర్యాదు మేరకు పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు. సోషల్ మీడియా పోస్టులపై ప్రశ్నించిన హరిని కులం పేరుతో దూషించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సజ్జల భార్గవ్ తో పాటు ఇటీవల పోలీసుల నుంచి తప్పించుకున్న వర్రా రవీందర్ రెడ్డి, అర్జున్ రెడ్డిలపైన పోలీసులు కేసు నమోదు చేశారు. హరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు భార్గవ్ రెడ్డితోపాటు మరో ఇద్దరిపైన పోలీసులు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు పెట్టారు.
Also Read: Actress Kasturi : పరారీలో నటి కస్తూరి.. ఇంటికి తాళం, ఫోన్ స్విచ్ఛాఫ్!
సోషల్ మీడియాలో దూషణలకు పాల్పడుతూ పోస్టులు పెడుతున్న వారిపై కూటమి ప్రభుత్వం కొరడా ఝుళిపిస్తున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతున్న వారిని గుర్తించి ఇప్పటికే పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకోగా.. మరికొందరికి నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో దుష్ప్రచారం, వ్యక్తిగత టార్గెట్ లతో పోస్టులు పెడితే సహించేది లేదని తీవ్ర స్థాయిలో హెచ్చరికలు చేసిన విషయం తెలిసిందే.