ఏపీలో త్వరలోనే మంత్రివర్గ విస్తరణ జరిగే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది. ఖాళీ అయిన రెండు మంత్రి పదవుల భర్తీపై సీఎం జగన్ కసరత్తులు చేస్తున్నారు. 2 స్థానాలు బీసీ సామాజిక వర్గానికి, ఖాళీ అయిన డిప్యూటీ సీఎం పదవి కూడా బీసీలకే కేటాయించాలని సీఎం జగన్ యోచిస్తున్నారు. కొంతమంది మంత్రుల శాఖలను కూడా మారుస్తారని తెలుస్తోంది.
పెడన ఎమ్మెల్యో జోగి రమేశ్, ముమ్ముడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ లు రేసులో ఉన్నారు. ఈనెల 22వ తేదీన కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం. ఇద్దరు మంత్రులు.. మోపిదేవి వెంకటరమణారావు, పిల్లి సుభాష్‌చంద్రబోస్‌లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. దీంతో వారు తమ తమ పదవులకు రాజీనామా చేశారు.
వీరిద్దరూ బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు. ఈ క్రమంలో ఈ స్థానాలను భర్తీ చేయాల్సి ఉంది. గతంలోనే కొంతమంది మంత్రుల శాఖలను మార్చాలని సీఎం జగన్ భావించారని, కానీ కరోనా వైరస్ విస్తరిస్తుండడంతో దీనిని తాత్కాలికంగా వాయిదా వేశారని సమాచారం. ప్రస్తుతం ఆషాడమాసం కొనసాగుతున్న నేపథ్యంలో..ఇప్పుడే మంత్రివర్గ విస్తరణ చేపట్టకూడదని సీఎం జగన్ భావిస్తున్నారని తెలుస్తోంది. శ్రావణమాసం జూన్ 21వ తేదీ నుంచి ప్రారంభం కాబోతోంది. దీంతో 22వ తేదీన ముహూర్తం నిర్ణయించారని సమాచారం.
Read:ఏపీలో ఉద్యోగుల జీతాలకు లైన్ క్లియర్