AP Cabinet (1)
AP Cabinet Key Decisions : ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. జగనన్న ఆరోగ్య సురక్ష రెండో విడతకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. జనవరిలో వైఎస్ఆర్ ఆసరా, చేయూత పథకాలు అమలు చేయనున్నారు. సీఎం జగన్ అధ్యక్షతన సెక్రటేరియట్ లో శుక్రవారం క్యాబినెట్ సమావేశం జరిగింది. పలు కీలక అంశాలపై క్యాబినెట్ చర్చించింది.
ఆరోగ్య శ్రీ పరిధిని రూ.25 లక్షల పెంచుతూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. విశాఖ లైట్ మెట్రో ప్రాజెక్టు డీపీఆర్ కు క్యాబినెట్ ఆమోదం లభించింది. పెన్షన్లను రూ.3 వేలకు పెంచుతూ క్యాబినెట్ నిర్ణయించింది. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు మంజూరులో సంస్కరణలకు ఆమోదం లభించింది.
జనవరి నుంచి సామాజిక పెన్షన్లు రూ.2వేల 750 నుంచి రూ.3 వేలకు పెంచారు. క్యాబినెట్ సమావేశం జరుగుతుండగా ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మరణవార్త సమాచారం వచ్చింది. ఎమ్మెల్సీ షేక్ సాబ్జీకి క్యాబినెట్ సంతాపం తెలిపింది.