Sajjala Ramakrishna Reddy : అధికారంలోకి వస్తామని చంద్రబాబు పగటి కలలు.. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి వచ్చే సీట్లు సున్నా: సజ్జల
చంద్రబాబును ప్రజలు ఎప్పుడో తిరస్కరించారని తెలిపారు. చంద్రబాబు హయాంలో తుఫాన్ బాధితులను ఆదుకున్న దాఖలాలు లేవన్నారు.

Sajjala Ramakrishna Reddy
Sajjala Ramakrishna Reddy : ఉద్దానాన్ని ఇప్పటివరకు ఎవరూ పట్టించుకోలేదని ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఉద్దానం సమస్యకు సీఎం జగన్ శాశ్వత పరిష్కారం చూపారని పేర్కొన్నారు. జగన్ పాలనలో అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నాయని తెలిపారు. 31 లక్షల కటుంబాలకు ఇళ్ల స్థలాలు ఇచ్చామని పేర్కొన్నారు. నాడు – నేడు కింద స్కూళ్ల రూపరేఖలు మార్చామని వెల్లడించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని పేర్కొన్నారు.
చంద్రబాబును ప్రజలు ఎప్పుడో తిరస్కరించారని తెలిపారు. చంద్రబాబు హయాంలో తుఫాన్ బాధితులను ఆదుకున్న దాఖలాలు లేవన్నారు. అధికారంలోకి వస్తామని చంద్రబాబు పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. ఏపీకి చంద్రబాబు గెస్ట్ లా వచ్చి వెళ్తారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి వచ్చే సీట్లు సున్నా అని ఎద్దేవా చేశారు.
చంద్రబాబు జైల్ నుండి వచ్చాక ఎన్నికల గురించి, గతంలో చేసిన పని గురించి చెప్పకుండా తమ పాలనలో చేసిన అభివృద్ధి చూసి ఆయనకి అర్ధం కాక మాట్లాడుతున్నారని తెలిపారు. 1 కోటి, 69లక్షల మంది కుటుంబాలు తమ పాలనలో అభివృద్ధి చెందాయని చెప్పారు. 30 లక్షల ఇంటి స్థలాలు, 5లక్షల ఇంటి నిర్మాణం జరిగాయని తెలిపారు. విద్యా వ్యవస్థలో నాడు- నేడు కింద అభివృద్ధి చేశామని వెల్లడించారు. ఉద్దానం సమస్యను శాశ్వత పరిష్కరించాలని నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన ఘనత సీఎం జగన్ ది అన్నారు. చంద్రబాబు కథలు ప్రజలు నమ్మరని పేర్కొన్నారు. టీడీపీ పాలనలో చేసిన మంచి ఒక్కటైనా ఉందా అని ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో వచ్చిన తుఫాన్, వరదల గురించి చేసిన ఖర్చులు గురించి లెక్కలు చెప్పగలరా? అని నిలదీశారు. తుఫాన్ వలన కలిగిన నష్టం మీద సీఎం జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారని తెలిపారు. 22 లక్షలు ఎకరాల్లో నష్టం జరిగింది అని చంద్రబాబు ఏ అంచనా ప్రకారం చెబుతున్నాడని ప్రశ్నించారు.
అర్హత ఉన్నా చివర కుటుంబం వరకు న్యాయం చేయడమే తమ ఉదేశం అన్నారు. 300 రోజులు హైదరాబాద్ లో ఉన్న ఆంధ్రప్రదేశ్ తో చంద్రబాబుకి సంబంధం లేదన్నారు. చంద్రబాబుకు ప్రజా ఆమోదం లేదు కాబట్టే 2018 లోనే ప్రజలు ఇంటికి పంపారని పేర్కొన్నారు. రాష్టాన్ని చీకటి పాలు చేసిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. చంద్రబాబు, ఆయన వర్గం ఆస్తులు హైదరాబాద్ లో ఉన్నాయని, లోకేష్ కానీ చంద్రబాబు కానీ ఆంధ్రప్రదేశ్ కి గెస్ట్ గా వస్తున్నారని తెలిపారు.
CPI Ramakrishna : కేంద్రంలో మోదీని గద్దె దించాలి.. ఏపీలో జగన్‌ను ఇంటికి పంపాలి : సీపీఐ రామకృష్ణ
కనకదుర్గమ్మ గుడిలో గతంలో చంద్రబాబు క్షుద్ర పూజలు చేశాడు అలాంటి పూజలు మళ్ళీ చేసినా ఆయన గెలవడని తెలిపారు. మంగళగిరిలో బీసీకి టిక్కెట్ ఇచ్చాము అక్కడ లోకేష్ ని ఎందుకు పోటీ పెడుతున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు బీసీ సీటు కుప్పం ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు. తమ పార్టీ పరిస్థితిని బట్టి తమ అభ్యర్థుల మార్పులు ఉంటాయని తెలిపారు. 2024లో టీడీపీకి జీరో సీట్లు వస్తాయని, కుప్పం కూడా గెలిచే పరిస్థితి లేదన్నారు. టీడీపీ హయాంలో జరిగిన అరాచకాలను వైసీపీకి రుద్దాలని చూస్తున్నాడని తెలిపారు.
తెలంగాణలో ఓట్లు వేసి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఓట్లు వేయడానికి టీడీపీ తరుపున ఒక టీమ్ ఉందని ఆరోపించారు. గతంలో సేవామిత్ర లాగే ఇప్పుడు మరో నాటకానికి టీడీపీ తెర లేపిందన్నారు. స్టేట్ లో జరిగిన అభివృద్ధి ఇంటి ఇంటికి తీసుకు వెళ్ళేది వాలంటీర్ ఏ కదా? అని ప్రశ్నించారు. చంద్రబాబు చేసిన అప్పులు, కోవిడ్ పరిస్థితి వలన తమ ప్రభుత్వం మీద బరువు ఉన్నా పథకాలు ఆగకుండా అమలు చేసిన వ్యక్తి జగన్ అన్నారు. జగన్ననే మళ్ళీ ఎందుకు రావాలి అనేది ప్రభుత్వ పోగ్రామ్ అని అన్నారు.
అంగన్వాడీల ధర్నాకు వెళ్తూ.. రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ దుర్మరణం
టీడీపీ హయాంలో రాష్ట్ర మొత్తం బెల్ట్ షాపులు ఉండేవి..ఇపుడు ఎక్కడా లేవన్నారు. 175లో దత్త పుత్రుడు పవన్ కు ఎన్ని సీట్లు చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ఖాలిగా ఉన్నాడు కాబట్టి టీవిలో డిబేట్ కి విశ్లేషకుడు లాగా వెళ్ళితే బాగుంటుందన్నారు. బీసీ, ఎస్సీ సీట్లు మార్చినా తన వారికే కదా ఇచ్చేదన్నారు. నిమ్మగడ్డ రమేష్, ఎల్వీ సుబ్రమణ్యంలు సిటిజన్ ఫర్ డెమోక్రసీని ఏర్పాటు చేసింది చంద్రబాబు కోసమేనని చెప్పారు.
చంద్రబాబు కోసం, చంద్రబాబు చేత ఏర్పాటు చేసింది సిటిజన్ ఫర్ డెమోక్రసీ అని తెలిపారు. ఎస్వీ సుబ్రమణ్యంకు సుప్రీంకోర్టులో కేసులు వేసి, కోట్ల రూపాయలు ఫీజులు ఇచ్చేంత ఆర్థిక స్థోమత ఎక్కడిదన్నారు.