పరిటాల సునీత ఇంటిముందు ధర్నా చేస్తా.. వైసీపీ ఎమ్మెల్యే వార్నింగ్
వచ్చే సోమవారం నాటికి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించకపోతే పరిటాల సునీత, కాంట్రాక్టర్ ఇంటిముందు ధర్నా చేస్తామని ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి హెచ్చరించారు.

YCP MLA Prakash Reddy
Raptadu constituency MLA : 2024 ఎన్నికల్లో రాప్తాడు నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా మళ్లీ తానే పోటీ చేస్తా, విజయం సాధిస్తానని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పరిటాల కుటుంబం రాప్తాడులో పాసింగ్ క్లౌడ్స్ వచ్చి వెళ్లే మేఘాలు లాంటివాళ్లని అన్నారు. రాప్తాడు నియోజకవర్గ పరిధిలో 33 గ్రామాల్లో రోడ్డు నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలని కరపత్రాలు పంపిణీ చేయబోతున్నామని చెప్పారు. రోడ్డు నిర్మాణ పనుల కాంట్రాక్ట్ ను పరిటాల సునీత కుటుంబీకులు దక్కించుకున్నారని, ఇన్నాళ్లకు రోడ్లు వేయడం లేదని ప్రశ్నించారు.
Also Read : ప్రజా పాలన మొదలైంది.. తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం
వచ్చే సోమవారం నాటికి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించకపోతే పరిటాల సునీత, కాంట్రాక్టర్ ఇంటిముందు ధర్నా చేస్తామని ప్రకాశ్ రెడ్డి హెచ్చరించారు. రాబోయే వంద రోజుల్లో వంద కిలోమీటర్లు నియోజకవర్గం పరిధిలో రోడ్డు నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ప్రణాళికలు రూపొందించామని చెప్పారు. ధర్మవరం టికెట్ కోసం పరిటాల శ్రీరామ్ ఇరవై కోట్లు చంద్రబాబు దగ్గర డిపాజిట్ చేశారని విమర్శించారు. రాప్తాడు నియోజకవర్గానికి పరిటాల కుటుంబం అవసరం లేదని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి అన్నారు.