Governor Tamilisai : ప్రజా పాలన మొదలైంది.. తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం

తెలంగాణ ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు. మన ప్రభుత్వం త్వరలోనే దేశానికి రోల్ మోడల్ కాబోతుందన్నారు.

Governor Tamilisai : ప్రజా పాలన మొదలైంది.. తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం

Governor Tamilisai

Updated On : December 15, 2023 / 2:53 PM IST

Telangana Assembly Governor Tamilisai : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగించారు. అసెంబ్లీ ఉభయ సభలను ఉద్ధేశించి ఆమె మాట్లాడారు. కాలేజీ కవితతో గవర్నర్ ప్రసంగాన్ని ప్రారంభించారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు అభినందలు చెప్పారు. మీ ప్రయాణం ప్రజాసేవకు అంకితం కావాలని కోరుకుంటున్నానని తెలిపారు. ప్రజా పాలన మొదలైందన్నారు.

తెలంగాణ ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు. మన ప్రభుత్వం త్వరలోనే దేశానికి రోల్ మోడల్ కాబోతుందన్నారు. ప్రజల ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రజావాణి చేపట్టామని తెలిపారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చే దిశగా కృషి చేస్తామని చెప్పారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేసిన సోనియాకు 4 కోట్ల తెలంగాణ ప్రజల తరపున శుభాకాంక్ష తెలిపారు. తెలంగాణలో త్వరలో ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామని చెప్పారు.

KCR Discharge : యశోద ఆస్పత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్

ఆరు గ్యారంటీల్లో రెండు గ్యారంటీలను ఇప్పటికే అమలు చేశామని తెలిపారు. మహాలక్ష్మీ స్కీమ్ లోని మిగత పథకాలను అతి త్వరలో అమలు చేస్తామని చెప్పారు. వైద్య ఖర్చులు పెరగడంతో ఆరోగ్యశ్రీ పరిధిని రూ.10 లక్షలకు పెంచామని తెలిపారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని చెప్పారు. మహాలక్ష్మీ, రైతు, భరోసా, ఇందిరమ్మ ఇళ్లు వంటి అన్ని పథకాలను పూర్తి చేస్తామని చెప్పారు.

వ్యవసాయరంగానికి నాణ్యమైన, నింతరాయ విద్యుత్ ను అందిస్తామని తెలిపారు. అసైన్డ్, పోడు భూములకు పట్టాలందిస్తామని పేర్కొన్నారు. త్వరలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పారు. ప్రజల ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రజావాణి చేపట్టామని తెలిపారు.