KCR Discharge : యశోద ఆస్పత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్

యశోద ఆస్పత్రి నుంచి మాజీ సీఎం కేసీఆర్ డిశ్చార్జ్ అయ్యారు. సర్జరీ తరువాత కోలుకున్న కేసీఆర్‌ను డాక్టర్లు ఈరోజు డిశ్చార్జ్ చేశారు.

KCR Discharge : యశోద ఆస్పత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్

KCR Discharge

Updated On : December 15, 2023 / 12:10 PM IST

KCR Discharge : యశోద ఆస్పత్రి నుంచి మాజీ సీఎం కేసీఆర్ డిశ్చార్జ్ అయ్యారు. డిసెంబర్ 8న సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో కేసీఆర్‌కు తుంటి ఎముక సర్జరి జరిగిన విషయం తెలిసిందే. సర్జరీ తరువాత కోలుకున్న కేసీఆర్‌ను ఈరోజు డాక్టర్లు డిశ్చార్జ్ చేశారు. దీంతో ఆయన బంజారాహిల్స్ లోని నందినగర్ నివాసానికి వెళ్లారు. కేసీఆర్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవుతున్నారని తెలిసి ఆయన అభిమానులు భారీగా ఆస్పత్రికి చేరుకున్నారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన కేసీఆర్‌ను ప్రత్యేక వాహనంలో నందినగర్‌లోని నివాసానికి తీసుకెళ్లారు. కేసీఆర్ వాహనంలో కేటీఆర్, హరీశ్ రావులు ఉన్నారు. వీల్‌చైర్‌లో వాహనం వరకు వచ్చిన కేసీఆర్ తన నివాసానికి బయలుదేరారు.

కేసీఆర్ డిసెంబర్ 7న తన వ్యవసాయ క్షేత్రంలో కాలుజారి పడిన విషయం తెలిసిందే. దీంతో ఆయన ఎడమ తుంటి భాగంలో గాయమైంది. వెంటనే యశోద ఆస్పత్రికి ఆయనను తరలించారు. పరీక్షలు చేసిన డాక్టర్లు తుంటి ఎముకకు గాయమైందని గుర్తించారు. అనంతరం సర్జరీ చేశారు. ఈక్రమంలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన్ని పరామర్శించారు. తరువాత ఆయన కోలుకుని ఈరోజు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

కాగా.. మాజీ సీఎం కేసీఆర్‌కు తెలంగాణ ప్రభుత్వం భద్రత కుదించింది. 4+4 గన్ మెన్స్, ఎస్కార్ట్ వాహనంతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. ఆయన ఇంటిముందు ఇద్దరు సెంట్రీలు మాత్రమే కాపాలాగా ఉంటారు.

Also Read: మజ్లిస్‌తో దోస్తీకి గ్రీన్ సిగ్నల్ వెన‌క రేవంత్‌కు ప‌క్కా ఫ్యూహం!