Andhra Pradesh Cabinet meeting
AP Cabinet Key Decisions : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో మంత్రి మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 38 అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎస్ఐపీబీ నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో కులగణన చేపట్టేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నవంబర్ 15వ తేదీ నుంచి కుల గణన ప్రారంభించాలని నిర్ణయిచింది. దేవాలయాల ఆదాయ పరిమితుల ప్రకారం కొత్త కేటగిరీలుగా విభజనకు ఆమోదం లభించింది.
అంతర్జాతీయ టెన్నిస్ క్రీడాకారుడు మైనేని సాకేత్ కు గ్రూప్ 1 పోస్ట్ ఇచ్చేందుకు అంగీకరించింది. ఉద్యోగులకు ఇటీవల ప్రకటించిన డీఏకు ఆమోదం తెలిపింది. అలాగే జగనన్న సురక్ష కార్యక్రమంపై కేబినెట్ లో చర్చించారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపునకు ఆమోదం తెలిపింది.
ఇతర ముఖ్యాంశాలు
– నవంబర్ నెలలో సంక్షేమ క్యాలండర్ అమలుకు కేబినెట్ ఆమోదం
– రైతు భరోసా ఆర్థిక సాయం, అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు కల్పించే అంశంపై కేబినెట్ ఆమోదం
– ఖరీఫ్ లో ధాన్యం సేకరణ కోసం పౌరసరఫరాల కార్పొరేషన్ కు 5 వేల కోట్ల రుణం తీసుకునేందుకు అనుమతి
– పరిశ్రమల ఏర్పాటు కు ఎస్ఐపిబి లో తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం
– ఏపీ లో 6 జోన్లు గా ఉద్యోగ కేడర్ నియామకానికి కేబినెట్ అనుమతి
– రహదారులు భవనాల శాఖ అతిథి గృహాల్లో 467 అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకానికి గ్రీన్ సిగ్నల్
– తూర్పు గోదావరి, సత్య సాయి జిల్లాల్లో ఒక్కొక్క రవాణా శాఖ యూనిట్ లు ఏర్పాటు కు ఆమోదం
– ప్రతీ ఒక్కరూ ఆరోగ్యశ్రీ యాప్ డౌన్ లోడ్ చేసుకునేలా నిర్ణయం
– 6790 ప్రభుత్వ హై స్కూల్ లో సాంకేతిక నైపణ్యత కోసం ఇంజినీరింగ్ కళాశాలతో మ్యాపింగ్
– విద్యుత్ బస్సులు, ట్రక్కుల తయారీ సంస్థ పెప్పర్ మోషన్ సంస్థ కు చిత్తూరు జిల్లాలో భూ కేటాయింపు
– కర్నూలులో పవన విద్యుత్.. కడప, నంద్యాలలో సౌర విద్యుత్ యూనిట్ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం
– గ్రీన్ హైడ్రోజెన్ హబ్ ఏర్పాటుకు ఎన్టీపిసి కి అనుమతి
– ఫెర్రో అల్లాయ్స్ పరిశ్రమలకు విద్యుత్ డ్యూటీని రూపాయి నుంచి అరు పైసలకు తగ్గిస్తూ నిర్ణయం