AP Cabinet Meeting: ఏపీ క్యాబినెట్ సమావేశానికి వేళైంది. నేడు ఉదయం 11 గంటలకు మంత్రివర్గం భేటీ కానుంది. సీఆర్డీఏ ప్రతిపాదనలకు మంత్రి మండలి ఆమోదం తెలపనుంది.
రాజధాని గ్రామాల్లో అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పనకు క్యాబినెట్ లో చర్చించి ఆమోదం తెలపనున్నారు.
అలాగే జిల్లాల పునర్ విభజన, జిల్లా పేర్ల మార్పు, కొత్త జిల్లాల ఏర్పాటుపై క్యాబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తోంది.
సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం కానుంది. ఇందులో చాలా కీలకమైన అంశాలపై చర్చించి తుది నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇటీవలే సీఎం అధ్యక్షతన సీఆర్డీఏ సమావేశం జరిగింది.
ఇందులో చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. రాజధాని ప్రాంతంలో ఉన్న గ్రామాలకు 904 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాలు, అభివృద్ధి పనులకు సంబంధించి కీలకమైన నిర్ణయం తీసుకోనున్నారు.
సీఆర్డీఏ పరిధిలో అనేక రకాలైన అంశాలు ముడిపడి ఉన్నాయి. వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై చర్చించారు.
వీటిని మంత్రి వర్గం ముందు ఉంచి వాటికి ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
రాజధాని ప్రాంతంలో ఉన్న గ్రామాల్లో మౌలిక సదుపాయాలు, అభిృద్దికి సంబంధించి విమర్శలు వస్తున్న నేపథ్యంలో 904 కోట్లు కేటాయించారు.
దీనికి మంత్రివర్గం ఆమోదం తెలిపి తదుపరి కార్యక్రమాలను చేపట్టే అవకాశం ఉంది. గత ప్రభుత్వం హయాంలో జిల్లాల మార్పులు జరిగాయి. జిల్లాల పేర్ల మార్పులు చేర్పులకు సంబంధించిన అంశంపైనా చర్చ జరగబోతోంది.
Also Read: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏకు జగన్ మద్దతు.. ప్లానేంటి..?