AP Cabinet: ఏపీ క్యాబినెట్‌లో చర్చకు రానున్న అంశాలు

ఏపీ రాష్ట్ర క్యాబినెట్ మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. రాష్ట్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ తర్వాత బుధవారం తొలి క్యాబినెట్ సమావేశం జరగబోతుంది. మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో...

AP Cabinet: ఏపీ రాష్ట్ర క్యాబినెట్ మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. రాష్ట్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ తర్వాత బుధవారం తొలి క్యాబినెట్ సమావేశం జరగబోతుంది. మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది.

ఏపీ క్యాబినెట్ లో పలు ప్రధానమైన అంశాలను చర్చించి ఆమోదించనున్నారు.

ఇందులో భాగంగా వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్ మీటర్లు, దేవాదాయ శాఖలో ఉద్యోగాల నోటిఫికేషన్‌కు సంబంధించి 83వ నిబంధనకు చట్టసవరణ అంశంపై చర్చించనున్నారు. వివిధ సంస్థలకు భూముల కేటాయింపు, ఇంటింటికీ మన ప్రభుత్వం, తుపాన్ నేపథ్యంలో సహాయసహకారాలపై ప్రభుత్వం చర్చించనుంది.

Read Also: ఏపీ కేబినెట్ భేటీ.. ప్రధాన చర్చ ఆ అంశాలపైనే..

దేవాదాయ శాఖలో రెండు లక్షల ఎకరాల భూమి ఆక్రమణకు గురైన అంశం, అమ్మఒడి పథకానికి సంబంధించి మొత్తాన్ని అందించే అంశాలపై మరోకసారి చర్చ జరగనుంది. దాంతో పాటుగా దిశ చట్టం సంబంధించి ఏపీ క్యాబినెట్ లో చర్చ జరగనుంది.

ట్రెండింగ్ వార్తలు