మూడు రాజధానుల ప్రకటనతో రాజధాని రైతులు రగిలిపోతున్నారు. గొల్లపూడిలో రైతులకు అండగా టీడీపీ నేత దేవినేని రోడ్డుపై బైఠాయించారు. మూడు పంటలు పండుతాయి..రాజధానికి ఎందుకు ఇచ్చాం..తమ భవిష్యత్ బాగుండాలని ఇచ్చాం..మూడు రాజధానులు వల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయంటున్నారు తుళ్లూరు వాసులు. 2019, డిసెంబర్ 19వ తేదీ శుక్రవారం రాజధాని ప్రాంత గ్రామాల్లో బంద్ కొనసాగుతోంది.
స్వచ్చందంగా రైతులు బంద్‌లో పాల్గొంటున్నారు. 29 గ్రామాల ప్రజలు బంద్ పాటిస్తున్నారు. వెలగపూడిలో రిలే నిరహార దీక్షలు కొనసాగుతున్నాయి. గ్రామానికి ఇద్దరు చొప్పున నిరసన దీక్ష చేపడుతున్నారు. ఈ సందర్భంగా 10tv రైతులు, విద్యార్థులు, మహిళలు, ఇతరులతో మాట్లాడింది. రాజధాని కోసం భూములు ఇచ్చిన వారి పరిస్థితి ఏంటీ అని ప్రశ్నించారు. వాళ్లు కొన్నారు ? వీళ్లు కొన్నారు ? అనేది ఎందుకు ప్రశ్నిస్తున్నారు.
రాజధాని తమకు ఇక్కడే ఉంచాలని డిమాండ్ చేశారు. మూడు రాజధానులు అవసరం లేదు..తాము కోరుకుంటున్నది ఒక్కటేనన్నారు. సీఎం జగన్ విలువ నిలబెట్టుకోవాలని ఓ మహిళ సూచించారు. సీఎం జగన్ ప్రకటనను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వాణిజ్య సముదాయాలు, సంస్థలు మూతపడ్డాయి.
రాజధాని పరిధిలో ప్రశాంతంగా బంద్ జరుగుతోందని డీఎస్పీ శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. 29 గ్రామాల్లో 350 మంది పోలీసు సిబ్బందిని నియమించినట్లు, తుళ్లూరు, మందడం లాంటి సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు పోలీసు సిబ్బందిని నియమించడం జరిగిందన్నారు. రాజధాని పరిధిలీో సెక్షన్ 144, 30 అమల్లో ఉందన్నారు.
* తుళ్లూరులో రైతుల రాస్తారోకో.
* అమరావతి ప్రాంతంలో 144, 34 సెక్షన్ అమలు.
* 29 గ్రామాల ప్రజలు బంద్‌లో పాల్గొంటున్నారు.
* మూడు ప్రాంతాల్లో రాజధానులు వద్దంటూ రైతుల బైఠాయింపు.
* మూడు రాజధానులు వద్దు..ఒక రాజధానే ముద్దు అంటూ నినాదాలు.