రాజధానిపై జడ్జీ, విచారణ ఎందుకు బాబూ – బోత్స

  • Publish Date - December 23, 2019 / 01:28 PM IST

రాజధానిపై GN RAO కమిటీ..ఇతరత్రా వాటిపై బాబు డిమాండ్ చేస్తున్నట్లు జడ్జీ, ఎంక్వయిరీ ఎందుకు అని ప్రశ్నించారు మంత్రి బోత్స సత్యనారాయణ. బాబు మాటలను నమ్మి మోసపోవద్దని అమరావతి ప్రజలకు సూచించారు. బాలకృష్ణ వియ్యంకుడు (బాబు కొడుకుకు తోడల్లుడు) రాజధాని పెట్టిన అనంతరం 500 ఎకరాలను కట్టబెట్టారా ? లేదా నిలదీశారు. దీనిపై జీవో ఇచ్చారా ? లేదా ? పరిశ్రమకు ఇస్తే సపోర్టు చేస్తామన్నారు. సీఆర్డీఏలో కలిపారా ? లేదా చెప్పాలని సవాల్ విసిరారు. ఇది దోపిడి కాదా అని నిలదీశారు. 

హెరిటేజ్ సంస్థ 24, 25 ఎకరాలు కొనుగోలు చేసిందని రాష్ట్ర ఆర్థిక మంత్రి శాసనసభలో ప్రకటన చేశారనే విషయాన్ని చెప్పారు. రాజధాని అనౌన్స్ చేయకముందే..కొనుగోలు చేసినట్లు బాబు చెప్పారని తెలిపారు. కానీ ముఖ్యమంత్రి కాకముందు కొనుగోలు చేయలేదని..సీఎం అయిన తర్వాతే కొనుక్కొన్నారు కదా అని చెప్పారు. ఇంకా సాక్ష్యాలు ఎందుకు..ఇది వాస్తవాలు కాదా అన్నారు.

అంతేగాకుండా…ఎన్నికల కంటే ముందు..డిసెంబర్ నెలలో అమరావతి ప్రాంతంలో రూ. 30 వేల కోట్ల రూపాయలతో కూడిన టెండర్లు పిలవడం కరెక్టా ? ఇది వాస్తవమా ? కాదా ? ఇది దోపిడీ కోసం కాదా అన్నారు మంత్రి బోత్స. సోషల్ మీడియాలో పెయిడ్ ఆర్టిస్టులతో దుర్భాషలాడిస్తున్నారని, రాష్ట్ర ప్రజలు అందరూ ఆలోచించాలన్నారు. 

బోత్స ఇంకా ఏమన్నారంటే :-
* రాజధానిపై డిసెంబర్ 27న నిర్ణయం
* గత ఐదేళ్లలో విశాఖ అభివృద్ధి చెందలేదు. 
* జీఎన్ రావు నివేదికపై కేబినెట్ లో చర్చ. 
* అమరావతిలో తాత్కాలిక అసెంబ్లీ.
* రైతులు ఇచ్చిన భూములను అభివృద్ధి. 
 

* తాము అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడమే లక్ష్యం. 
* అమాయక ప్రజలను ముందు పెట్టి..దోచుకుతిన్నారు. 
* బాబు ఇంకా ప్రజలను మోసం చేయాలని అనుకుంటున్నారు. 
* బాబు మాటలను నమ్మకండి. 
* సోషల్ మీడియాలో పెయిడ్ ఆర్టిస్టులతో దుర్భాలాడిస్తున్నారు.
Read More : రాజధానిపై 27న నిర్ణయం..బాబు మాటలు నమ్మవద్దు – బోత్స