Tirupati Hospital : తిరుపతి ఆస్పత్రిలో మరణ మృదంగం..వారంలో తొమ్మిది శిశువులు మృతి

తిరుపతి ప్రసూతి ఆస్పత్రిలో వరుసగా పసిబిడ్డలు మరణాలు సంభవిస్తున్నాయి.వారం రోజుల్లో తొమ్మిది శిశు మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి.

Tirupati maternity hospital: తిరుపతి ప్రసూతి ఆస్పత్రిలో వరుసగా పసిబిడ్డలు మరణాలు సంభవిస్తున్నాయి. ఒడిలోని బిడ్డలు ణించడంతో తల్లులు కడుపు కోతతో అల్లాడుతున్నారు. ఈ శిశు మరణ మృదంగాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ఆస్పత్రికి బిడ్డలను తీసుకురావాలంటేనే తల్లిదండ్రులు హడలిపోతున్నారు. కేవలం వారం రోజుల్లోనే తొమ్మిది మంది శిశువులు మరణించారు. దీంతొ ఈ ప్రసూతి ఆస్పత్రికి రావటానికి భయపడిపోతున్న పరిస్థితి నెలకొంది.

ఒక్కరు, ఇద్దరు కాదు..తిరుపతి ప్రసూతి ఆస్పత్రిలో ఏకంగా 14మంది పసిబిడ్డలు మృతి చెందారు. వారం రోజుల్లో 9మంది మృత్యువాత పడటంపై కుటుంబ సంక్షేమ శాఖ సీరియస్‌ అయింది. ప్రస్తుతం శిశు మరణాలపై విచారణ జరుపుతోంది.

మరోవైపు రుయా చిన్నపిల్లల ఆస్పత్రిలోనూ శిశు మరణాలు కొనసాగుతుండటంపై ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తం అవుతోంది. దీనిపై కుటుంబ సంక్షేమ శాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. పసికందుల మరణాలతో ఆస్పత్రి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంటోంది. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే శిశు మరణాలు కొనసాగుతున్నాయని ఆందోళనలకు దిగారు భాదితులు. ఈ ఘటనపై కమిషనర్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అడిషనల్ డైరెక్టర్ అనిల్ విచారించనున్నారు.

ట్రెండింగ్ వార్తలు