Chandrababu : నేడు చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ.. ఏపీ సీఐడీ పిటిషన్ లో కీలక అంశాలు

చంద్రబాబుకు బెయిల్‌ మంజూరులో తమ వాదనలు, ఆధారాలను హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదని ఏపీ సీఐడీ పిటిషన్‌లో పేర్కొంది.

Chandrababu Bail

AP CID Petition Against Chandrababu Bail : ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. చంద్రబాబు బెయిల్ ను రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ ను విచారించనుంది. 16వ కోర్టులో ఐటెమ్ నెంబర్ 64 కింద ఈ కేసు లిస్టు అయింది.

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఏపీ హైకోర్టు నవంబర్ 20న రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ఈ బెయిల్ ను సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం నవంబర్ 21న సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బెయిల్ కేసు విచారణ సమయంలో హైకోర్టు మినీ ట్రయల్ నిర్వహించిందని, వాస్తవాలను పరిగణనలోకి తీసుకోవడంలో పొరబడిందని ఏపీ తరపు న్యాయవాదులు ఆరోపించారు. హైకోర్టు తన పరిధిని అతిక్రమించినందు వల్ల చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టును కోరింది.

చంద్రబాబు బెయిల్‌ రద్దు చేయాలని కోరిన సీఐడీ

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఏపీ సీఐడీ ఆశ్రయించింది. చంద్రబాబుకు నవంబర్ 20న హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తకూ ఏపీ సీఐడీ నవంబర్ 21న సుప్రీంకోర్టును ఆశ్రయించింది. చంద్రబాబుకు బెయిల్‌ మంజూరులో తమ వాదనలు, ఆధారాలను హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదని ఏపీ సీఐడీ పిటిషన్‌లో పేర్కొంది. హైకోర్టు తన పరిధి దాటి తీర్పులో వ్యాఖ్యలు చేసిందని ఏపీ సీఐడీ తెలిపింది. వెంటనే చంద్రబాబు బెయిల్‌ రద్దు చేయాలని సుప్రీంకోర్టును కోరింది.

ఏపీ సీఐడి పిటిషన్ లో కీలక అంశాలు
ఏపీ సీఐడీ పిటిషన్ లో కీలక అంశాలు ప్రస్తావించింది. చంద్రబాబుకు బెయిల్ విషయంలో హైకోర్టు పరిధి దాటిందని తెలిపింది. సుప్రీంకోర్టు నిర్దేశించిన కొలమానాలను హైకోర్టు అతిక్రమించిందని వివరించింది. కేసు లోతుల్లోకి వెళ్లి క్లీన్ చిట్ ఇచ్చే ప్రయత్నం చేసిందన్నారు. ట్రయల్ కోర్టును ప్రభావితం చేసేలా హైకోర్టు తీర్పు ఉందని తెలిపారు.

మినీ ట్రయల్ నిర్వహణ జరిగిందనడానికి 39 పేజీల తీర్పు నిదర్శనం అన్నారు. దుర్వినియోగం చేసిన నిధులు టీడీపీ ఖాతాల్లోకి వెళ్లాయని ఆరోపించింది. అందుకు పూర్తి ఆధారాలున్నా హైకోర్టు ఏ మాత్రం పట్టించుకోలేదని తెలిపింది. చంద్రబాబుకు రాజకీయ పలుకుబడి ఉందని వెల్లడించింది.

హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని కోరిన సీఐడీ
సాక్షులను బెదిరించడం ద్వారా దర్యాప్తును ప్రభావితం చేస్తారని పేర్కొంది. హైకోర్టు తేల్చిన అంశాలు వాస్తవ విరుద్ధంగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ సుప్రీంకోర్టులో తేలేంతవరకు హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని సుప్రీంకోర్టును ఏపీ సీఐడీ కోరింది.

ట్రెండింగ్ వార్తలు