Operation Sindoor: ‘ఆపరేషన్‌ సిందూర్‌’పై చంద్రబాబు, రేవంత్, జగన్, బండి సంజయ్ సహా ప్రముఖులు స్పందన ఇదే..

పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతాల్లోని ఉగ్రవాద శిభిరాలపై భారత్ ఆర్మీ వైమానిక దాడులు చేయడంతోపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

Operation Sindoor

Operation Sindoor: పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకార చర్యలకు దిగింది. ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత ఆర్మీ, ఎయిర్ పోర్స్, నేవీ బలగాలు సంయుక్తంగా మెరుపుదాడులు చేశాయి. ఆపరేషన్ సిందూర్ లో భాగంగా పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్ ప్రాంతాల్లోని తొమ్మిది ఉగ్రవాద శిభిరాలపై భారత ఆర్మీ వైమానిక దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో 80మంది ఉగ్రవాదులు మృతిచెందినట్లు సమాచారం.

Also Read: Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’.. పాక్ ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు..

పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతాల్లోని ఉగ్రవాద శిభిరాలపై భారత్ ఆర్మీ వైమానిక దాడులు చేయడంపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. భారత సైన్యం చర్యలకు మద్దతు ఇస్తున్నామని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ తెలిపారు. కాగా.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖులుసైతం భారత్ ఆర్మీ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’కు మద్దతు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.

Also Read: Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’పై స్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌.. ఏమన్నారంటే..?

ఆపరేషన్ సిందూర్ పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. ‘‘ఆపరేషన్ సింధూర్ ఖచ్చితమైనది. భారతదేశం దాడి చేసినప్పుడు, అది వేగంగా, ఖచ్చితంగా ఉంటుంది. మన దళాలు ఎక్కడ దెబ్బతింటాయో అక్కడ దాడి చేస్తాయి. పహల్గాం అమరవీరులు ప్రతీకారం తీర్చుకున్నారు. భారతదేశంతో గొడవ, మూల్యం చెల్లించుకోండి. మన ధైర్యవంతులను చూసి గర్విస్తున్నాము! మేరా భారత్ మహాన్’’ అంటూ సంజయ్ పేర్కొన్నారు.

భారత ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ పై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ఆర్మీ ట్విటర్ పేజీని ట్యాగ్ చేస్తూ ‘జై హింద్’ అని క్యాప్షన్ పెట్టారు. దీనికి ఇండియన్ ఆర్మీ, పహల్గాం టెర్రర్ అటాక్, ఎయిర్ స్ట్రైక్, ఆపరేషన్ సిందూర్ అనే హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చారు.

భారత ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ పై ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి స్పందించారు..‘‘పహల్గాం ఉగ్రవాద దాడికి నిర్ణయాత్మక ప్రతిస్పందనగా భారత రక్షణ దళాలు ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించాయి. అటువంటి సమయాల్లో, ఇటువంటి అనివార్య చర్యలు దేశం యొక్క సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడంలో, దేశంలోని పౌరులను రక్షించడంలో ఉన్న అచెంచలమైన శక్తిని ప్రతిబింబిస్తాయి. మేమందరం మీకు అండగా నిలుస్తాము. జై హింద్.’’ అంటూ జగన్ ట్వీట్ లో పేర్కొన్నారు.

భారత ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ పై ఏపీ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ‘న్యాయం జరిగింది. జైహింద్’ అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు. ఇండియన్ ఆర్మీ ట్విటర్ పేజీని ట్యాగ్ చేశారు.

 

సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. ‘‘ముందుగా ఒక భారతీయ పౌరుడిగా, మన సాయుధ దళాలకు బలంగా అండగా నిలుస్తున్నాం. పాకిస్తాన్ & పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలపై జరిగిన దాడులు మనల్ని గర్వపడేలా చేస్తున్నాయి. దీనిని జాతీయ సంఘీభావం, ఐక్యతకు ఒక క్షణంగా చేసుకుందాం, మనమందరం ఒకే గొంతుతో మాట్లాడుకుందాం – జై హింద్!’’ అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు.