Cm Chandrababu And Deputy CM Pawan Kalyan On Kashmir Haryana Election Results
Kashmir Haryana Election Results : హరియాణా, జమ్ముకశ్మీర్ ఎన్నికల ఫలితాలపై సీఎం చంద్రబాబు స్పందించారు. ”హరియాణాలో బీజేపీ ఘన విజయం సాధించింది. ఇది హిస్టారికల్ విక్టరీ. బీజేపీ గెలుపుపై రకరకాల ఊహాగానాలు వినిపించాయి. హిందీ బెల్ట్ లో బీజేపీ ప్రభావం తగ్గిపోయింది. క్రమంగా పార్టీ దెబ్బ తింటోంది. ఇలాంటి అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. ఇంకెన్నో ప్రచారాలు జరిగాయి. ఈ క్రమంలో ప్రధాని మోదీపై ఉన్న నమ్మకం, బీజేపీ పని చేసిన విధానం, అగ్ర నాయకత్వం చూపిన చొరవ వల్ల హరియాణాలో బ్రహ్మాండమైన విజయం సాధించింది.
నేనూ ప్రధాని మోదీతో మాట్లాడాను. ఆయనకు అభినందలు తెలిపాను. ఇది ఎన్డీయేకు కూడా మంచి విక్టరీ. ఇందులో గమనిస్తే.. మంచి పనులు చేస్తే ఏ విధంగా ఆదరిస్తారో అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. 90 అసెంబ్లీ సీట్లకు గాను 48 సీట్లు గెలిచారు. అదే సమయంలో 39.94 శాతం ఓట్లు వచ్చాయి. లాస్ట్ టైమ్ 36శాతం ఓట్లు వచ్చాయి. మూడోసారి 4శాతం ఓట్లు పెరిగాయి.
Also Read : ఏపీ రాజకీయాలపై వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు.. మా వాళ్లు కూడా ఆ బుక్స్ మెయింటెన్ చేస్తున్నారు..
అంటే, ఒక వ్యక్తి మీద నమ్మకం, లేకపోతే ఒక పార్టీ చేపట్టిన కార్యక్రమాలు, సుపరిపాలన.. రోజురోజుకు ఓట్ల శాతం పెరిగే పరిస్థితి వస్తోంది. దీనికి నేను బీజేపీ, ప్రధాని మోదీనే కాకుండా హరియాణా ప్రజలను కూడా అభినందిస్తున్నా. ఒక సుస్థిరతకు, అభివృద్ధి, సంక్షేమానికి మీరు ఓటు వేశారు. దానికి మిమ్మల్ని అభినందిస్తున్నా. జమ్ముకశ్మీర్ లో బీజేపీ ఒక బలమైన శక్తిగా ఎదిగింది” అని సీఎం చంద్రబాబు అన్నారు.
జమ్ముకశ్మీర్, హరియాణా ఎన్నికల ఫలితాలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. హరియాణాలో బీజేపీ గొప్ప విజయం సాధించిందన్నారు. హాట్రిక్ గెలుపు నమోదు చేసి మూడోసారి అధికారం చేపట్టబోతున్న బీజేపీకి పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు చెప్పారు. అటు జమ్ముకశ్మీర్ ప్రజల్లో మార్పు కనిపించిందన్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓట్ల శాతం గణనీయంగా పెరిగిందన్నారు.
”జమ్ము కశ్మీర్ ప్రజల్లో మార్పు కనిపిస్తోంది. కశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరిగిన ఈ ఎన్నికల్లో ఓటు శాతం పెరిగింది. గెలిచిన బీజేపీ నాయకులకు శుభాకాంక్షలు. బీజేపీ నాయకత్వానికి కూడా శుభాకాంక్షలు. హరియాణాలో బీజేపీ గెలుపు అద్భుతం” అని పవన్ కల్యాణ్ అన్నారు.
Also Read : హర్యానాలో కాంగ్రెస్‌ను దెబ్బకొట్టిన ఆప్.. కలిసి పోటీచేస్తే ఫలితాలు మరోలా ఉండేవా..