YS Jagan: ఏపీ రాజకీయాలపై వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు.. మావాళ్లు కూడా ఆ బుక్స్ మెయింటెన్ చేస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయన్న జగన్.. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రతి ఇంటికీ మంచిచేశాం.. ప్రతి ఇంటికీ గర్వంగా తలెత్తుకుని వెళ్లగలం.

YS JaganMohan Reddy
YS Jagan Comments : ఏపీ రాజకీయాలపై మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళగిరి నియోజకవర్గం పార్టీ నాయకుల సమావేశంలో వైఎస్ జగన్ పాల్గొని మాట్లాడారు. మంగళగిరి నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలకు పూర్తి భరోసా ఇవ్వాలని భావించామని తెలిపారు. అధికార దుర్వినియోగంతో వైసీపీ కార్యకర్తలకు నష్టం చేస్తున్నప్పుడు కచ్చితంగా భరోసా ఇవ్వాలని, పార్టీ తోడుగా ఉంటుందనే విశ్వాసం కల్పించాలనే ఉద్దేశంతోనే సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అన్నింటికీ తట్టుకొని పార్టీ కార్యకర్తలకు అండగా ఉండే వ్యక్తి ఉండాలని భావించి వేమారెడ్డిని ఇంచార్జిగా నియమించినట్లు జగన్ తెలిపారు.
Also Read: Rahul Gandhi: పోరాటం ఆగదు.. హరియాణా ఎన్నికల ఫలితాలపై రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు
రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయన్న జగన్.. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రతి ఇంటికీ మంచిచేశాం.. ప్రతి ఇంటికీ గర్వంగా తలెత్తుకుని వెళ్లగలమని అన్నారు. మేనిఫెస్టోలో చెప్పిన హామీలను అమలుచేసే పార్టీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. బడ్జెట్‌తోపాటు సంక్షేమ క్యాలండర్‌కూడా విడుదలచేసేవాళ్లం. ప్రతినెలలో క్రమం తప్పకుండా బటన్ నొక్కి పథకాలు అమలు చేశాం. ఇది కేవలం ఐదేళ్ల వైయస్సార్ కాంగ్రెస్ పాలనలోనే జరిగిందని జగన్ అన్నారు. ఐదేళ్ల పాలనలో అనేక సంక్షోభాలను ఎదుర్కొన్నాం. కోవిడ్ లాంటి మహా సంక్షోభాన్ని ఎదుర్కొన్నాం. రెండేళ్లపాటు కోవిడ్‌తో యుద్ధం చేశాం. రాబడులు తగ్గిపోయాయి, ఖర్చులు విపరీతంగా పెరిగాయి. అయినా ఏరోజుకూడా సాకులు చూపకుండా పథకాలు అమలు చేశామని జగన్ గుర్తు చేశారు.
Also Read: Bhanu Prakash Reddy : దువ్వాడ శ్రీనివాస్, మాధురిపై చర్యలు తీసుకోవాలి
ప్రతి ఇంట్లోనూ వైసీపీ ప్రభుత్వం హయాంలో అందించిన పథకాలపై చర్చ జరుగుతుంది. జగన్ పలావు పెట్టాడు.. చంద్రబాబు బిర్యానీ పెడతానన్నాడు. ఇప్పుడు పలావూ పోయింది.. బిర్యానీ పోయిందనే చర్చ జరుగుతోందని జగన్ పేర్కొన్నారు. పార్టీని బలోపేతం చేయాలి.. సంస్థాగతంగా అత్యంత బలంగా ఉండాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టాలు ఉంటాయి. కష్టాల నుంచే నాయకులు పుడతారు. నన్ను 16 నెలలు జైల్లో పెట్టి తీవ్రంగా వేధించారు. అయినా ప్రజల ఆశీస్సులతో మనం ముందడుగు వేశాం. కష్టాలు ఎక్కువ కాలం ఉండవని అన్నారు.
లోకేశ్ రెడ్‌బుక్ పై జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రెడ్‌బుక్ ఏమైనా పెద్దపనా? ఎప్పుడూ లేని దుష్టసంప్రదాయాన్ని చంద్రబాబు ప్రభుత్వం తీసుకు వచ్చింది. ఇప్పుడు నేను చేయొద్దని చెప్పినా మా వాళ్లుకూడా బుక్స్ మెయింటెన్ చేయడం మొదలుపెడుతున్నారు. అన్యాయం చేసేవారి పేర్లను, అలాంటి అధికారుల పేర్లను రాసుకుంటున్నారు. అదే సమయంలో మేం గుడ్‌బుక్ కూడా రాసుకోవడం మొదలుపెట్టాం. పార్టీకి మంచి చేసినవారిని, కష్టపడే వారి పేర్లనుకూడా రాసుకుంటున్నాం. వారికి తప్పకుండా అవకాశాలు, ప్రమోషన్లు ఉంటాయని జగన్ పేర్కొన్నారు.