Stree Shakti Scheme: ఇక ఏసీ బస్సుల్లోనూ ఫ్రీ జర్నీ.. ‘స్త్రీశక్తి’ పథకంలో కీలక మార్పులు.. మహిళలకు ఏపీ సర్కార్ బిగ్ గిఫ్ట్

Free AC Bus: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 'స్త్రీశక్తి(Stree Shakti Scheme)' పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించిన విషయం తెలిసిందే.

Ap cm chandrababu naidu announces free rtc ac bus travel for women stree shakthi scheme

  • ఏసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
  • సిఎం చంద్రబాబు కీలక ప్రకటన
  • తగ్గనున్న సాధారణ బస్సుల రద్దీ

Stree Shakti Scheme: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి మరో కీలక నిర్ణయం తీసుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ‘స్త్రీశక్తి(Stree Shakthi Scheme)’ పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించిన విషయం తెలిసిందే. అయితే, ప్రస్తుతం కేవలం పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ వంటి ఐదు కేటగిరీల బస్సులకే ఇది పరిమితం కావడంతో విపరీతమైన రద్దీ పెరుగుతోంది. ఈ సమస్యకు పరిష్కారంగా, మహిళలకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు త్వరలోనే ఏసీ బస్సుల్లో కూడా ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారికంగా ప్రకటించారు.

Read Also – Hitech City Railway Station: పండుగ రద్దీకి పక్కా ప్లాన్.. హైటెక్ సిటీలో రైళ్ల నిలుపుదల పొడగింపు.. పూర్తి వివరాలు మీకోసం!

మోగల్తూరు సభలో ప్రకటన.. రద్దీ నియంత్రణకు ముందడుగు:

మోగల్తూరులో నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు ఈ తీపి కబురు అందించారు. రాష్ట్రంలో త్వరలోనే భారీ సంఖ్యలో కొత్త ఏసీ బస్సులను ప్రవేశపెట్టనున్నామని, వాటిలో మహిళలకు స్త్రీశక్తి పథకం వర్తింపజేస్తామని స్పష్టం చేశారు. సాధారణ బస్సులపై ఒత్తిడి తగ్గించడంతో పాటు, వేసవిలో కూడా మహిళలు హాయిగా ప్రయాణించేలా ఆర్టీసీ అధికారులు ఈ దిశగా కసరత్తు చేస్తున్నారు. చంద్రబాబు స్పష్టమైన హామీ ఇవ్వడంతో త్వరలోనే ఇది అమల్లోకి రానుంది.

‘దివ్యాంగశక్తి’ సేవలు విస్తరణపై ఆసక్తి.. పెరగనున్న సౌకర్యాలు:

ఇప్పటికే రాష్ట్రంలో ‘దివ్యాంగశక్తి’ పథకం ద్వారా 40 శాతానికి పైగా అంగవైకల్యం ఉన్న వారికి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని, వారి సహాయకులకు 50 శాతం రాయితీని ప్రభుత్వం అందిస్తోంది. అయితే, ఏసీ బస్సుల్లో కూడా దివ్యాంగులకు ఉచిత ప్రయాణం వర్తిస్తుందా లేదా అన్నదానిపై త్వరలో స్పష్టత రానుంది. ఏదేమైనా, ఏసీ బస్సుల్లోనూ స్త్రీశక్తి పథకాన్ని వర్తింపజేయాలన్న నిర్ణయం పట్ల రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహిళా లోకం హర్షం వ్యక్తం చేస్తోంది.