Cm Chandrababu
Cm Chandrababu Delhi Tour : ఢిల్లీ పర్యటనలో సీఎం చంద్రబాబు బిజీబిజీగా గడుపుతున్నారు. ప్రధాని మోదీతో ఆయన సమావేశం అయ్యారు. గంటపాటు ఈ సమావేశం జరిగింది. రాష్ట్ర అభివృద్ధికి సహకారం, పెండింగ్ అంశాలపై చర్చించారు. మరోవైపు వరుసగా కేంద్ర మంత్రులను చంద్రబాబు కలుస్తున్నారు. కేంద్ర మంత్రి అమిత్ షాతోనూ భేటీ అయ్యారు. రాష్ట్ర పరిస్థితులు, పాలన, కేంద్రం సహకారంపై చర్చించారు. రాజకీయ అంశాలపైనా డిస్కషన్ జరిగింది.
బుధవారం సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ అయ్యారు. గంటపాటు ఆయనతో చర్చలు జరిపారు. రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని చంద్రబాబు కోరారు. కేంద్ర బడ్జెట్ 2025-26 వార్షిక బడ్జెట్ లో రాష్ట్రానికి సంబంధించిన అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, నిధులు కేటాయించాలని ముందస్తుగానే బడ్జెట్ సన్నాహక సమావేశాలను కేంద్ర ఆర్థికశాఖ నిర్వహిస్తోంది. ప్రధాని మోదీ కూడా ఆర్థికవేత్తలతో వచ్చే ఆర్థిక బడ్జెట్ పై సమావేశాలు నిర్వహించడం జరిగింది.
Also Read : ఒక్క పోస్ట్.. ఇద్దరు లాబీయింగ్..! ఆ నామినేటెడ్ పోస్ట్ కు ఎందుకంత డిమాండ్? దక్కేదెవరికి?
ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రధానిని కలిశారు. స్వర్ణాంధ్రపదేశ్ రూపకల్పనలో భాగంగా ఏపీలో అభివృద్ధి చేసేందుకు ఎటువంటి ప్రణాళికలతో ముందుకెళ్తున్నారు, దానికి ఎంత నిధులు అవసరం అవుతాయన్న దానిపై చర్చలు జరిపారు. అలాగే ఇప్పటికే చేపట్టిన ప్రాజెక్టులు పోలవరం, అమరావతి, పరిశ్రమలు, వివిధ కేంద్రం సంస్థల ఏర్పాటుకు సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ఆర్థిక సహకారం వీటన్నింటికి సంబంధించిన అంశాలపైనా డిస్కస్ చేశారు.
Also Read : కొందరు జంప్, ఇంకొందరు సైలెంట్.. ప్రభుత్వ విధానాలపై పోరాడేందుకు వైసీపీ నేతలు భయపడుతున్నారా?