పార్లమెంటు, అసెంబ్లీ, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలి: చంద్రబాబు

వన్ నేషన్, వన్ ఎలక్షన్‌కు అన్ని పార్టీలు సహకరించాలని కోరారు. 

Cm Chandrababu Naidu

పార్లమెంటు, అసెంబ్లీ, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అన్నింటికీ ఎన్నికలు ఒకేసారి నిర్వహిస్తే అభివృద్ధిపై దృష్టి సారించవచ్చని తెలిపారు.

వన్ నేషన్, వన్ ఎలక్షన్‌కు అన్ని పార్టీలు సహకరించాలని కోరారు. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన నినాదంతో మోదీ ముందుకు వెళ్తున్నాని, అందుకే బీజేపీకి దేశ వ్యాప్తంగా ఆదరణ కొనసాగుతోందని చంద్రబాబు నాయుడు తెలిపారు. జమ్మూకశ్మీర్ లో బీజేపీ బలమైన శక్తిగా ఆవిర్భవించిందని తెలిపారు.

మనదేశానికి గొప్పబలం యువతేనని, ఇతర దేశాల్లో వృద్ధుల సంఖ్య పెరుగుతోందని చంద్రబాబు నాయుడు చెప్పారు.
దేశంలో 7 శాతం వృద్ధి రేటు ఉందని, ఎన్డీఏ ప్రభుత్వం మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి పెట్టిందని అన్నారు. వ్యవసాయం, ఆరోగ్య రంగాల్లో ఉపాధి అవకాశలు పెరిగాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు విభజనతో వచ్చిన నష్టం కంటే.. విధ్వంస పాలనతో ఎక్కువ నష్టం జరిగిందని గత జగన్ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు.