రోజులు లెక్కపెట్టుకో..మోడీకి బాబు వార్నింగ్

నరేంద్రమోడీ పాలనలో దేశ ఆర్థిక రంగం కుదేలైందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఢిల్లీలో బుధవారం(ఫిబ్రవరి-13,2019) ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేపట్టిన ధర్నాకు చంద్రబాబు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మోడీ పాలనలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఐదేళ్ల మోడీ పాలనకాలంలో అనేకసార్లు రైతులు ఆందోళనకు దిగారు. మోడీకి కనీస పరిపాలనా సూత్రాలు కూడా తెలియవు. నోట్ల రద్దుతో  ప్రజలందరూ నష్టపోయారని, దేశ ఆర్థికవ్యవస్థ పూర్తిగా నాశనమైపోయింది, దేశంలో సహకార వ్యవస్థ ఎక్కడుందని మోడీని  సూటిగా ప్రశ్నిస్తున్నా.

 

మేమంతా ఎక్కడ చదువుకున్నామో చెప్పగలం..మోడీ చెప్పగలరా?రాఫెల్ డీల్ లో అవకతవకలు జరిగాయి. విపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు. మోడీ ఒత్తిడి తట్టుకోలేక ఆర్బీఐ గవర్నర్ రాజీనామా చేశారు. యూపీలో మంగళవారం అఖిలేష్ రని అలహాబాద్ వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు..ఎందుకో చెప్పాలి? విపక్ష నేతలపై ఐటీ దాడులు జరుగుతున్నాయి.

 

మోడీ అప్రజాస్వామ్య పాలన నుంచి విముక్తి కలిగించేందుకే మేమంతా ఏకమయ్యాం. మోడీ పాలనలో ప్రాథమిక హక్కులు, స్వేచ్ఛను కోల్పోయాం, అందరం కలిసి ఈ దేశాన్ని కాపాడాలి, ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది. విపక్షాలన్నీ ఏకం కాకపోతే..మనందరికీ ఇవే చివరి ఎన్నికలవుతాయి,రేపు ఇంకో ఎన్నికలుండవని బాబు అన్నారు.

ట్రెండింగ్ వార్తలు