మళ్లీ ఢిల్లీకి సీఎం జగన్‌, ప్రధాని మోడీ సహా కేంద్రమంత్రులతో భేటీ.. చర్చించే అంశాలు ఇవే

  • Publish Date - October 5, 2020 / 11:47 AM IST

ap cm jagan delhi tour: ఏపీ సీఎం వైఎస్‌ జగన్ ఇవాళ(అక్టోబర్ 05,2020) ఢిల్లీ వెళ్లనున్నారు. పెండింగ్ నిధుల విడుదల, విభజన సమస్యలు, జలవివాదాల పరిష్కారం కోసం ప్రధాని సహా పలువురు కేంద్రమంత్రులను కలిసే అవకాశాలున్నాయి. మంగళవారం(అక్టోబర్ 06,2020) జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి కూడా జగన్ హాజరయ్యే అవకాశం ఉంది.

ఏపీ-తెలంగాణ మధ్య నెలకొన్న జలవివాదాలను పరిష్కరించేందుకు మంగళవారం అపెక్స్‌ కమిటీ భేటీ జరగనుంది. కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్‌ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో జగన్ పాల్గొనే అవకాశముంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పలు ప్రాజెక్టులపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కృష్ణా, గోదావరి బోర్డులకు లేఖలు రాసింది ఏపీ ప్రభుత్వం. రాష్ట్రంలో కొత్తగా చేపట్టే ప్రాజెక్టులపైనా క్లారిటీ ఇవ్వనున్నట్టు సమాచారం.



సీఎం జగన్‌ ముందుగా అమరావతి నుంచి పులివెందులకు వెళ్లనున్నారు. అక్కడ ఈసీ గంగిరెడ్డి సంస్మరణ సభకు హాజరై నివాళులు అర్పించనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు జగన్‌ పులివెందుల నుంచి కడప
ఎయిర్‌పోర్టుకు బయలుదేరుతారు. 1.40కి కడప ఎయిర్‌ పోర్టు నుంచి విమానంలో గన్నవరం చేరుకుంటారు. 2.30కి గన్నవరం ఎయిర్‌ పోర్టు నుంచి ఢిల్లీకి బయలుదేరుతారు.సాయంత్రం 5 గంటలకు ఢిల్లీ ఎయిర్‌
పోర్టుకు జగన్‌ చేరుకుంటారు. అటు నుంచి ఢిల్లీలోని 1 జనపథ్‌కు చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేస్తారు.



రేపు ప్రధానితో సహా పలువురు కేంద్ర మంత్రులను కలువనున్నట్లు సమాచారం. అలాగే రేపు అపెక్స్ కౌన్సిల్ భేటీలో పాల్గొననున్నారు. ఇప్పటికే హోం మంత్రి అమిత్‌షాను రెండుసార్లు కలిసిన జగన్.. మళ్లీ ఢిల్లీ వెళుతుండటం ఆసక్తి రేపుతోంది.

ట్రెండింగ్ వార్తలు