CM Jagan : సీఎం జగన్ విదేశీ పర్యటన.. సతీసమేతంగా ప్రత్యేక విమానంలో లండన్ కు పయనం

విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు ఆమోదం తెలుపగా, కేంద్రం నుంచి కూడా అనుమతులు వచ్చాయి. జగన్ లండన్ పర్యటన ముగించుకుని తాడేపల్లికి చేరుకున్న వెంటనే ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతతాయని భావిస్తున్నారు.

Jagan London Tour

CM Jagan London Tour : ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ సతీసమేతంగా విదేశీ పర్యటనకు బయల్దేరారు. సీఎం జగన్ దంపతులు శనివారం రాత్రి వ్యక్తిగత పర్యటన నిమిత్తం ప్రత్యేక విమానంలో లండన్ కు బయల్దేరి వెళ్లారు. అక్కడ చదువుకుంటున్న తమ కుమార్తెలను కలిసేందుకు ప్రతి ఏటా జగన్, భారతి దంపతులు లండన్ వెళ్లడం ఆనవాయితీగా వస్తోంది.

గన్నవరం విమానాశ్రయంలో మంత్రులు తానేటి వనిత, జోగి రమేష్, చీఫ్ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎమ్మెల్సీ రఘురాం, సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి, ఉన్నతాధికారులు వారికి వీడ్కోలు పలికారు. పది రోజుల విదేశీ పర్యటన అనంతరం సెప్టెంబర్ 12న తిరిగి తాడేపల్లికి సీఎం జగన్ చేరుకోనున్నారు.

Nara Lokesh : జగన్ పని అయిపోయింది, వచ్చేది మన ప్రభుత్వమే, 20లక్షలు ఉద్యోగాలు ఇస్తాం- నారా లోకేశ్

ఆయన విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు ఆమోదం తెలుపగా, కేంద్రం నుంచి కూడా అనుమతులు వచ్చాయి. జగన్ లండన్ పర్యటన ముగించుకుని తాడేపల్లికి చేరుకున్న వెంటనే ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతతాయని భావిస్తున్నారు.