Nirmala Sitharaman : నిర్మలా సీతారామన్‌తో ముగిసిన ఏపీ సీఎం జగన్ భేటీ

ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు సాయంత్రం కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తో  సమావేశం అయ్యారు.

Nirmala Sitharaman

Nirmala Sitharaman : ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు సాయంత్రం కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తో  సమావేశం అయ్యారు.  ఈ సందర్భంగా ఆయన రాష్ట్రానికి ఇవ్వాల్సిన పెండింగ్ నిధులు విడుదల చేయాలని ఆమెను కోరారు.

ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీతో సమావేశం ముగిసిన అనంతరం ఆయన నిర్మలా సీతారామన్ కార్యాలయానికి వెళ్లారు. ఆయన వెంట వైసీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, అవినాష్ రెడ్డి, వేంరెడ్డి, గోరంట్ల మాధవ్ ఉన్నారు.
Also Read : Telangana : పాల్వంచ ఆత్మహత్య కేసులో సంచలనం రేపుతున్న సూసైడ్ నోట్
కేంద్ర ఆర్ధిక మంత్రితో భేటీ సందర్భంగా రాష్ట్రానికి మరింత ఆర్థికసాయం చేయాలని నిర్మలా సీతారామన్‌ను సీఎం జగన్ కోరారు. వచ్చే బడ్జెట్‌లో పోలవరం, కేంద్ర సంస్థలకు నిధులు ఇవ్వాలని కూడా విజ్ఞప్తి చేశారు.