Ysr
Idupulapaya : నాన్న భౌతికంగా దూరమై 12 ఏళ్లైనా జనం మనిషిగా… తమింట్లో సభ్యునిగా నేటికీ జన హృదయాల్లో కొలువై ఉన్నారని ఏపీ సీఎ జగన్ అన్నారు. చిరునవ్వులు చిందించే ఆయన రూపం, ఆత్మయ పలకరింపు..మదిమదిలోనూ అలానే నిలిచి ఉన్నాయన్నారు. తాను వేసే ప్రతి అడుగులోనూ, చేసే ప్రతి ఆలోచనలోనూ నాన్న స్పూర్తి ముందుండి నడిపిస్తోందన్నారు సీఎం జగన్. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు.
Read More : LONDON : సిరీస్‌పై కన్నేసిన ఇంగ్లండ్..విజయం సాధించాలని ఇండియా
2021, సెప్టెంబర్ 02వ తేదీ గురువారం వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి. ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్ కడపలోని ఇడుపులపాయకు చేరుకున్నారు. అక్కడ ఘనంగా నివాళి అర్పించారు. ఆయనతో పాటు తల్లి విజయమ్మ, సోదరి షర్మిల కూడా ఉన్నారు. ఈ సందర్భంగా జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో వైఎస్ కుటుంబం పాల్గొంది. వైసీపీ నేతలు, వైఎస్ అభిమానులు ఘనంగా నివాళులర్పించారు.
Read More : Pawan Kalyan: పవన్ పేరు ముందు పవర్ స్టార్ బిరుదు.. ఎవరు పెట్టారో తెలుసా?
అనంతరం సీఎం జగన్ పార్టీ నాయకులతో మాట్లాడి.. తిరిగి అక్కడి నుంచి బయల్దేరి, మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాలకు తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. బుధవారం కడప జిల్లా ఇడుపులపాయకు వచ్చిన జగన్‌ను వైసీపీ నేతలు, ప్రజలు కలిశారు. సమస్యలపై వారి నుంచి వినతులు స్వీకరిస్తూ ఆప్యాయంగా పలకరించారు. నిన్న రాత్రి ఇక్కడి గెస్ట్ హౌస్‌లో సీఎం వైఎస్ జగన్ బస చేశారు.
నాన్న భౌతికంగా దూరమై 12ఏళ్లయినా జనం మనిషిగా, తమ ఇంట్లోని సభ్యునిగా నేటికీ జన హృదయాల్లో కొలువై ఉన్నారు.చిరునవ్వులు చిందించే ఆయన రూపం, ఆత్మీయ పలకరింపు మదిమదిలోనూ అలానే నిలిచి ఉన్నాయి. నేను వేసే ప్రతి అడుగులోనూ,చేసే ప్రతి ఆలోచనలోనూ నాన్న స్ఫూర్తి ముందుండి నడిపిస్తోంది#YSRForever
— YS Jagan Mohan Reddy (@ysjagan) September 2, 2021