Pawan Kalyan: పవన్ పేరు ముందు పవర్ స్టార్ బిరుదు.. ఎవరు పెట్టారో తెలుసా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఇప్పుడు ఈ పేరుకున్న వైబ్రేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. నేడు సెప్టెంబరు 2న పవన్ కల్యాణ్‌ 50వ జన్మదినం జరుపుకుంటున్నాడు.

Pawan Kalyan: పవన్ పేరు ముందు పవర్ స్టార్ బిరుదు.. ఎవరు పెట్టారో తెలుసా?

Pawan Kalyan

Updated On : September 2, 2021 / 8:50 AM IST

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఇప్పుడు ఈ పేరుకున్న వైబ్రేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. నేడు సెప్టెంబరు 2న పవన్ కల్యాణ్‌ 50వ జన్మదినం జరుపుకుంటున్నాడు. తమ అభిమాన హీరో పుట్టినరోజు కావడంతో ఫ్యాన్స్‌ ఫుల్‌ జోష్‌లో ఉన్నారు. వారం రోజుల ముందు నుండే పవన్ పుట్టినరోజును సెలబ్రేట్ చేసేందుకు ఫ్యాన్స్ భారీ ఏర్పాట్లు కూడా చేశారు. పవర్ స్టార్ పేరు చెప్తే పూనకాలు వచ్చినంత పనయ్యే అభిమానులు పవన్ సొంతం కాగా.. హిట్టు, ప్లాపుతో సంబంధం లేకుండా ఆయన మేనియా ఎప్పటికీ తగ్గడం లేదు.

అయితే.. ఇప్పుడు ఇంతగా పవర్ స్టార్ బిరుదుకు తగ్గట్లే ఎదిగిన పవన్ కు అసలు ఆ పేరు ఎవరు పెట్టారో తెలుసా. నటుడు, రచయిత పోసాని కృష్ణమురళినే పవన్ కళ్యాణ్ కు ముందు పవర్ స్టార్ బిరుదును ఉపయోగించారు. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో పవన్ నటించిన ‘గోకులంలో సీత’ బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి పోసాని కృష్ణమురళి మాటలు అందించారు. ఈ చిత్రం విడుదల సందర్భంగా పోసాని తొలిసారిగా విలేకరుల సమావేశంలో పవన్ కళ్యాణ్‌ను పవర్ స్టార్ అని సంబోధించారు.

అంతే, ఆ తర్వాత చాలా పత్రికలు పవన్ కళ్యాణ్ పేరుకు ముందు పవర్ స్టార్ బిరుదుతో కథనాలు రాయగా.. ఆ తర్వాత సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌లో వచ్చిన ‘సుస్వాగతం’ సినిమాకి తొలిసారిగా పవన్ కళ్యాణ్ పేరుకు ముందు పవర్ స్టార్ బిరుదుతో టైటిల్ కార్డ్ వేశారు. అలా పోసానినే పవన్ కు పవర్ స్టార్ అనే బిరుదును పెట్టారు. ఈ విషయాన్ని పవన్, పోసాని పలుమార్లు ఇంటర్వ్యూలలో కూడా వెల్లడించగా.. ఈరోజు పవన్ పుట్టినరోజున మరోసారి పవర్ స్టార్ పేరు వెనుక చరిత్ర సోషల్ మీడియాలో చర్చగా మారింది.