స్కూళ్లపై సీఎం జగన్ కీలక నిర్ణయం

  • Publish Date - October 20, 2020 / 04:46 PM IST

Andhra Pradesh schools to reopen from November 2: ఏపీలో కరోనా నేపథ్యంలో రాష్ట్ర సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నవంబర్ 2న స్కూళ్లు ప్రారంభమవుతాయని ఆయన చెప్పారు. 1, 3, 5, 7 తరగతులు ఒకరోజున, 2, 4,6,8 తరగతులు మరో రోజు నిర్వహిస్తామని జగన్ స్పష్టం చేశారు.



విద్యార్థుల సంఖ్య 750కి పైగా ఉంటే మూడు రోజులు తరగతులు నిర్వహిస్తామని చెప్పారు. మధ్యాహ్నం వరకు ఒంటి పూటే స్కూళ్లు పనిచేస్తాయని తెలిపారు.



పరిస్థితిని బట్టి డిసెంబర్ నెలలో నిర్ణయం తీసుకుంటామని సీఎం జగన్ పేర్కొన్నారు. విద్యార్థులను తల్లిదండ్రులు స్కూళ్లకు పంపకపోతే.. ఆన్ లైన్ తరగతులు నిర్వహిస్తామని సీఎం జగన్ వెల్లడించారు.