Ap Cm Jagan Polavaram Tour
YS Jagan Polavaram Tour : ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈనెల 14న పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ప్రాజెక్టులో జరుగుతున్న పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకుంటారు. 14న ఉదయం 10గంటలకు సీఎం జగన్ ప్రాజెక్టు వద్దకు చేరుకుంటారు.
ప్రాజెక్ట్ ప్రాంతంలో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను సమీక్షించేందుకు జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా, జిల్లా ఎస్పీ నారాయణ్ నాయక్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు,ఇంజినీర్ ఇన్ చీఫ్ ఈరోజు పరిశీలించారు. సీఎం ప్రాజెక్టును పరిశీలించే ప్రాంతం, సమీక్ష నిర్వహించే సమావేశ మందిరాన్ని అధికారులు పరిశీలించారు. పోలవరం ప్రాజెక్ట్ వద్ద గోదావరి నీటి మట్టం పెరుగుతున్న నేపథ్యంలో సీఎం పర్యటన ముందస్తు ఏర్పాట్లను అధికారులు దగ్గరుండి పరిశీలన చేస్తున్నారు.