Jagan corona vaccine : కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న సీఎం జగన్

ఏపీ సీఎం జగన్ కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. కరోనా వ్యాక్సిన్ తొలి డోస్ తీసుకున్నారు. గుంటూరు 140 వార్డు సచివాలయంలో వ్యాక్సిన్ తీసుకున్నారు.

AP CM Jagan vaccinated against corona : ఏపీ సీఎం జగన్ కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. కరోనా వ్యాక్సిన్ తొలి డోస్ తీసుకున్నారు. గుంటూరు 140 వార్డు సచివాలయంలో వ్యాక్సిన్ తీసుకున్నారు. జగన్ కు వైద్యాధికారులు కోవాగ్జిన్ వ్యాక్సిన్ వేశారు. జగన్ తోపాటు ఆయన సతీమణి వైఎస్ భారతి కూడా వ్యాక్సిన్ వేయించుకున్నారు. వ్యాక్సినేషన్ తర్వాత అరగంట పాటు జగన్ దంపతులు అబ్జర్వేషన్ లో ఉంటారు.

కరోనా సెకండ్ వేవ్ పెద్ద ఎత్తున విజృంభిస్తోన్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేశాయి. ఈ క్రమంలో ఇవాళ మూడో విడత వ్యాక్సినేషన్ లో భాగంగా 45 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ అందించే కార్యక్రమం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ ప్రథమంగా కోవాగ్జిన్ తీసుకున్నారు.

45 ఏళ్లు నిండినవారందరికీ ఈరోజు నుంచి వ్యాక్సిన్ ఇస్తున్నారు. జనవరి 16న దేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభమవ్వగా మొదటగా హెల్త్ కేర్ వర్కర్స్, ప్రంట్ లైన్ వర్కర్లకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టారు. సెకండ్ వేవ్ పెద్ద ఎత్తున ఉన్న నేపథ్యంలో వ్యాక్సిన్ ను స్పీడప్ చేయాలంటూ కేంద్రం నుంచి ఆదేశాలు వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు అందుకు అనుగుణంగా వ్యాక్సినేషన్ లో వేగాన్ని పెంచాయి.

కరోనా వ్యాక్సినేషన్ ను యజ్ఞంలా నిర్వహించాలని సీఎం జగన్ అన్నారు. ప్రస్తుతం 45 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం ఆదేశించిందని చెప్పారు. 4 నుంచి 6 వారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్ పూర్తి అవుతుందన్నారు. పరిషత్ ఎన్నికలను త్వరితగతిన పూర్తి చేయాలని కొత్త ఎస్ఈసీని కోరుతున్నాని తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు