Andra pradesh : తొలిసారి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో భేటీ కానున్న సీఎం జగన్

సీఎం జగన్ ఈరోజు ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాతో భేటీ కానున్నారు.

Ap Cm Jagan Meet Ap Hc Cj Prashant Kumar

AP CM Jagan meet AP HC CJ Prashant Kumar  : సీఎం జగన్ ఈరోజు (ఏప్రిల్ 25,2022) ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాతో భేటీ కానున్నారు. జ్యుడీషియల్ ప్రివ్వ్యూపై భేటీ సాయంత్రం 6.30గంటలకు విజయవాడలోని రాష్ట్ర ప్రభుత్వ అతిథిగృహంలో ఈ భేటీ జరగనుంది. జగన్-జస్టిస్ ప్రశాంత్ కుమార్ ఇప్పటికే పలు సందర్భాల్లో కలుసుకున్నా ప్రత్యేకంగా భేటీ కావడం మాత్రం ఇదే తొలిసారి. ఈ క్రమంలో వీరి భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. వీరి భేటీపై రాజకీయంగానూ చర్చ జరుగుతోంది. కాగా ఇప్పటికే జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా అమరావతి పనులు అంశంపై ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో వీరిద్దరి భేటీ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. కాగా..2019లో సీఎం జగన్ హైకోర్టు అప్పటి సీజే ప్ర‌వీణ్ కుమార్‌తో భేటీ అయిన విషయం తెలిసిందే. ఏపీలో జ్యూడిషియ‌ల్ క‌మిష‌న్ ఏర్పాటు గురించి జ‌గ‌న్ కీల‌క అడుగు వేసిన క్రమంలో భాగంగా వీరి భేటీ జరిగింది.