CM Jagan : ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన.. నేడు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ

మంత్రిత్వశాఖల వారీగా రాష్ట్రానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న అంశాలపై కేంద్ర మంత్రులకు ఏపీ సీఎం జగన్‌ విజ్ఞాపన పత్రాలు అందజేయనున్నారు.

Jagan

CM Jagan Delhi tour : ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం జగన్ ఇవాళ పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. ఉదయం తొమ్మిదిన్నర గంటలకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరితో ఆయన భేటీ కానున్నారు. ఆ తర్వాత ఉదయం పదిన్నర గంటలకు ధర్మేంద్ర ప్రధాన్‌తోనూ.. మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు అనురాగ్ ఠాగూర్‌తో సీఎం భేటీ కానున్నారు. మంత్రిత్వశాఖల వారీగా రాష్ట్రానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న అంశాలపై కేంద్ర మంత్రులకు జగన్‌ విజ్ఞాపన పత్రాలు అందజేయనున్నారు.

నిన్న ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌, కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి జ్యోతిరాధిత్యాతో జగన్ వేర్వేరుగా భేటీ అయ్యారు. సుమారు గంటపాటు ప్రధానితో చర్చించిన సీఎం.. ప్రధానంగా ఏడు అంశాలపై విజ్ఞప్తులు అందజేశారు. పోలవరం, ఆర్థిక అంశాలు సహా.. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలను, పెండింగ్‌ సమస్యలను ప్రధానికి జగన్‌ నివేదించారు.

Zero Survey : తెలంగాణలో నేటి నుంచి సీరో సర్వే

ఏపీకి ఆర్థిక సహకారం అందించాలని నిర్మలా సీతారామన్‌ను జగన్‌ కోరారు. 2022-23 వార్షిక బడ్జెట్‌లో పోలవరం సహా కేంద్ర సంస్థలకు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఏపీలో కొత్త విమానాశ్రయాల అభివృద్ధి, కార్గో టెర్మినళ్ల నిర్మాణం తదితర విషయాలను సింధియాతో సీఎం జగన్‌ చర్చించారు. భోగాపురం గ్రీన్‌ఫీల్డ్‌ అభివృద్ధికి సహకరించాలని కోరారు. విమానాశ్రయ సైట్‌ క్లియరెన్స్‌ అప్రూవల్‌ను రెన్యువల్‌ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ అంశాలకు సంబంధించి సీఎం జగన్‌ వినతిపత్రం అందజేశారు.