Sero Survey : తెలంగాణలో నేటి నుంచి సీరో సర్వే

మొత్తం 33జిల్లాల్లో 330 గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి శాంపిల్స్ సేకరించనున్నారు. 16 వేల మంది శాంపిల్స్ సేకరించి.. కరోనా కమ్యూనిటీ స్ర్పెడ్ గుర్తించనున్నారు.

Sero Survey : తెలంగాణలో నేటి నుంచి సీరో సర్వే

Zero

Sero survey in Telangana : తెలంగాణలో ఇవాళ్టి నుంచి సీరో సర్వే జరపనున్నారు. ICMR-NIN, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ సర్వే నిర్వహించనుంది. కరోనా కమ్యూనిటీ స్ప్రెడ్ తెలుసుకునేందుకు.. జనరల్ పబ్లిక్, హెల్త్ కేర్ వర్కర్స్ మీద సర్వే జరుపనున్నారు. మొత్తం 33జిల్లాల్లో 330 గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి శాంపిల్స్ సేకరించనున్నారు. 16 వేల మంది శాంపిల్స్ సేకరించి.. కరోనా కమ్యూనిటీ స్ర్పెడ్ గుర్తించనున్నారు.

మరోవైపు తెలంగాణలో కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు ఈ నెల 8వ తేదీ నుంచి 16 తేదీ వరకు సెలవులు ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. కాగా, సెలవుల్లో విద్యార్థులు కొవిడ్ నిబంధనలు పాటించాలని ప్రభుత్వం సూచించింది. బహిరంగ ప్రదేశాలకు వెళ్లేటప్పుడు తప్పకుండా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని చెప్పింది.

Fire Two-Wheeler : డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికాడు.. వాహనానికి నిప్పుపెట్టాడు

ప్రపంచవ్యాప్తంగా మరోసారి కరోనా విజృంభణ మొదలైంది. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కారణంగా కోవిడ్ కొత్త కేసులు భారీగా పెరిగాయి. దీంతో ఇప్పటికే పలు దేశాల్లో కరోనా కట్టడికి ఆంక్షలు విధించారు. భారత్‌లోనూ ఒమిక్రాన్‌ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. కరోనా కట్టడికి ఆంక్షలు విధిస్తున్నాయి.