Kadapa Tour : సీఎం జగన్ కడప జిల్లా టూర్.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన

ప్రొద్దుటూరులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన చేస్తారు. కొప్పర్తిలో మెగా ఇండస్ట్రియల్ హబ్ కు జగన్ శంకుస్థాపన చేయనున్నారు.

Jagan

AP CM Jagan Kadapa tour : ఏపీ సీఎం జగన్ కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నెల 23 నుంచి 25 వరకు మూడు రోజులపాటు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నెల 23న గోపవరంలో మెస్సర్స్ కంపెనీకి సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు.

ప్రొద్దుటూరులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన చేస్తారు. అలాగే కొప్పర్తిలో మెగా ఇండస్ట్రియల్ హబ్ కు జగన్ శంకుస్థాపన చేయనున్నారు. ఈనెల 24న పులివెందులలో ఆదిత్య బిర్లా యూనిట్ కు సీఎం శంకుస్థాపన చేయనున్నారు.

Pawan Kalyan : విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం జనసేన డిజిటల్ ఉద్యమం

అనంతరం నిర్వహించే బహిరరంగ సభలో సీఎం జగన్ పాల్గొని, ప్రసంగించనున్నారు. ఈ నెల 25న పులివెందుల సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో జగన్ పాల్గొననున్నారు.