Pawan Kalyan : విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం జనసేన డిజిటల్ ఉద్యమం

రాష్ట్ర ఎంపీలకు బాధ్యత గుర్తు చేద్దామని చెప్పారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు పార్లమెంట్ లో ప్లకార్డులు ప్రదర్శించాలన్నారు.

Pawan Kalyan : విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం జనసేన డిజిటల్ ఉద్యమం

Pawan

Updated On : December 17, 2021 / 4:53 PM IST

Janasena Digital Movement : విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం జనసేన డిజిటల్ ఉద్యమాన్ని చేపట్టనుంది. రేపటి నుంచి ఈ నెల 19వ తేదీ వరకు జనసేన డిజిటల్ క్యాంపెయిన్ చేయనుంది. వైసీపీ, టీడీపీ ఎంపీలను ట్విట్టర్ లో ట్యాగ్ చేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ఎంపీలకు బాధ్యత గుర్తు చేద్దామని చెప్పారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు పార్లమెంట్ లో ప్లకార్డులు ప్రదర్శించాలన్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కార్మికులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా డిసెంబర్ 12న పవన్ కళ్యాణ్ చేపట్టిన దీక్ష చేపట్టారు. మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన నిరసన దీక్ష చేపట్టారు. విశాఖ ఉక్కు కర్మాగారం కార్మికుల ఆందోళన 300 రోజులకు పైగా సాగుతోందని.. వారికి నైతికంగా మద్దతిచ్చేందుకు పవన్‌ దీక్ష చేపట్టినట్లు జనసేన వర్గాలు తెలిపాయి.

Union Minister Kiran Jiju : విశాఖలో కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ బెంచ్ ఏర్పాటు ప్రతిపాదన లేదు : కేంద్రమంత్రి కిరణ్ రిజిజు

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా చేపట్టిన దీక్షకు వచ్చిన ప్రతిఒక్కరికి పవన్ ధన్యవాదాలు తెలిపారు. సమస్య వచ్చినప్పుడు జనసేన గుర్తొస్తుంది… ఓటేసేటప్పుడు జనసేన గుర్తుకు రావాలి కదా అని అన్నారు. జనసేన పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి ఏ పదవి ఆశించలేదని చెప్పారు.

గాజువాకలో ఓడినా.. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పోరాడుతున్నామని స్పష్టం చేశారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై సీఎం జగన్‌ స్పందించాలని దీక్ష సందర్భంగా పవన్ డిమాండ్‌ చేశారు.