CM Jagan Letter : ఆలిండియా సర్వీస్ రూల్స్ లో సవరణలు.. కేంద్రానికి సీఎం జగన్ ప్రతిపాదనలు

సర్వీస్‌లో ఉన్న అధికారులను డిప్యూటేషన్‌పై పంపేందుకు ఇబ్బంది లేదని, అయితే వెంటనే డిప్యూటేషన్‌పై కేంద్రం తీసుకుంటే రాష్ట్రంలో ఆ అధికారి చేపట్టిన ప్రాజెక్టులకు ఇబ్బందులు వస్తాయన్నారు.

CM Jagan Letter to PM Modi : ఆలిండియా సర్వీస్‌ రూల్స్‌లో సవరణలను స్వాగతిస్తూనే కేంద్రానికి ఏపీ సీఎం జగన్‌ కీలక ప్రతిపాదనలు చేశారు. ఆలిండియా సర్వీస్‌ రూల్స్‌లో సవరణలను అభినందిస్తూ ప్రధాని మోదీకి లేఖ రాసిన సీఎం .. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో సమర్థవంతమైన అధికారులు వస్తారన్నారు. కేంద్ర ప్రభుత్వంలో సమర్థవంతమైన అధికారులుంటే రాష్ట్రాలకే మేలు జరుగుతుందన్నారు. అయితే ఆలిండియా సర్వీస్‌ రూల్స్‌లో కొన్ని సవరణలతో ఇబ్బందులు వచ్చే అవకాశముందని ప్రధానికి రాసిన లేఖలో జగన్‌ ప్రస్తావించారు.

సర్వీస్‌లో ఉన్న అధికారులను డిప్యూటేషన్‌పై పంపేందుకు ఇబ్బంది లేదని, అయితే వెంటనే డిప్యూటేషన్‌పై కేంద్రం తీసుకుంటే రాష్ట్రంలో ఆ అధికారి చేపట్టిన ప్రాజెక్టులకు ఇబ్బందులు వస్తాయన్నారు సీఎం జగన్‌. సమర్థులైన అధికారులకు కీలక ప్రాజెక్టుల బాధ్యతలను అప్పగిస్తుంటామని, అలాంటి అధికారిని ఆకస్మికంగా డిప్యూటేషన్‌పై తీసుకుంటే సమస్యలు తలెత్తుతాయన్నారు. తక్షణ బదిలీలతో అధికారుల కుటుంబం, పిల్లల చదువులపై ప్రభావం పడుతుందని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు.

Covid In India: వారం రోజులుగా కరోనా విధ్వంసం.. దేశంలో ఈ 15 జిల్లాల్లోనే!

డిప్యూటేషన్‌పై ఆలిండియా సర్వీస్‌ అధికారులను పంపే విషయంలో ప్రస్తుతం రాష్ట్రాలు అనుసరిస్తున్న పద్ధతినే కొనసాగించాలని ప్రధాని మోదీకి సీఎం జగన్‌ విజ్ఞప్తి చేశారు. ఎవరిని పంపాలనే నిర్ణయాన్ని రాష్ట్రాలకే వదిలేయాలని కోరారు. రాష్ట్రాలు ఎన్‌వోసీ ఇచ్చిన తర్వాతే అధికారులను తీసుకునే పద్ధతిని కొనసాగించాలని ప్రధానిని జగన్‌ కోరారు.

ట్రెండింగ్ వార్తలు