Covid In India: వారం రోజులుగా కరోనా విధ్వంసం.. దేశంలో ఈ 15 జిల్లాల్లోనే!

రెండు లక్షలకు పైగా కరోనా వైరస్ కేసులు రోజూ నమోదవుతుండగా.. శుక్రవారం(28 జనవరి 2021) కూడా 2లక్షల 51వేల 209 కొత్త కేసులు దేశవ్యాప్తంగా నమోదయ్యాయి.

Covid In India: వారం రోజులుగా కరోనా విధ్వంసం.. దేశంలో ఈ 15 జిల్లాల్లోనే!

Corona (2)

Covid In India: రెండు లక్షలకు పైగా కరోనా వైరస్ కేసులు రోజూ నమోదవుతున్నాయి. శుక్రవారం(28 జనవరి 2021) కూడా 2లక్షల 51వేల 209 కొత్త కేసులు దేశవ్యాప్తంగా నమోదవగా.. అందులో 627 మంది రోగులు మరణించారు. అదే సమయంలో, గడిచిన 24గంటల్లో 3లక్షల 47వేల 443 మంది రోగులు కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో కరోనా సంక్రమణ రేటు ఇప్పటికీ 15.88 శాతంగా ఉంది. ఇదే సమయంలో 21లక్షల 5వేల 611 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం, గత ఏడు రోజుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 15జిల్లాల్లొ చాలా వేగంగా పెరిగాయి. అందులోనూ ఏడు జిల్లాలు దక్షిణాది రాష్ట్రాలకు చెందినవే. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు అందిన సమాచారం ప్రకారం.. కేరళలో రెండు జిల్లాలు, గుజరాత్‌లో రెండు జిల్లాలు, మహారాష్ట్రలో రెండు జిల్లాలు, తమిళనాడులో రెండు జిల్లాల్లో కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. అదేవిధంగా హర్యానా, కర్ణాటక, రాజస్థాన్‌లలో ఒక్కో జిల్లా తీవ్రంగా ప్రభావితం అయ్యింది. జనవరి 21-27 మధ్య నమోదైన కేసులు ఇవి.

జిల్లాలవారీగా కేసుల వివరాలు:
బెంగళూరు అర్బన్: 1,43,960
పూణే: 75,592
ఎర్నాకులం : 55,693
తపురం: 46,570
అహ్మదాబాద్ : 44,666
చెన్నై : 30,218
నాగ్‌పూర్ : 28,326
కోజికోడ్ : 27,229
త్రిసూర్: 25,822
కోయంబత్తూర్ : 25,751
కొల్లాం : 23,191
వడోదర : 22,021
కొట్టాయం : 20,730
గురుగ్రామ్ : 19,727
జైపూర్: 19,289

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇచ్చిన సమాచారం ప్రకారం.. దేశంలోని 11 రాష్ట్రాల్లో.. 50 వేలకు పైగా కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయని చెప్పారు. కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, కర్ణాటక రాష్ట్రాల్లో చాలా యాక్టివ్‌గా కేసులు ఉన్నాయని వెల్లడించాయి. మొత్తం 551 జిల్లాల్లో కరోనా పాజిటివిటీ రేటు 5శాతం కంటే ఎక్కువగా ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి.