రాహుల్ తో సమావేశమైన చంద్రబాబు

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. బుధవారం (మే-8,2019) ఉదయం ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు రాహుల్ నివాసంలో ఆయనతో సమావేశమయ్యారు.తాజా రాజకీయ పరిస్థితులు , ఐదు దశల ఎన్నికల పోలింగ్ సరళిపై వీరిద్దరూ చర్చించినట్లు తెలుస్తోంది.

రాహుల్ తో సమావేశం అనంతరం చంద్రబాబు కోల్ కతాకు బయల్దేరారు. వెస్ట్ బెంగాల్ లో తృణముల్ కాంగ్రెస్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో మమతతో కలిసి బాబు పాల్గొంటారు. ఇవాళ, రేపు వెస్ట్ బెంగాల్ లో చంద్రబాబు మమత తరపున ప్రచారం చేస్తారు. గురువారం రాత్రి తిరిగి ఏపీకి బయల్దేరతారు.