Gidugu Rudraraja: సీఎం జగన్ అవినీతిపై సమగ్ర విచారణ చేపట్టాలి.. కాంగ్రెస్ అధికారంలోకొస్తే పాత పెన్షన్ విధానాన్ని తీసుకొస్తాం

ప్రత్యేక హోదాకోసం కేంద్రం మెడలు వంచుతానని చెప్పిన సీఎం జగన్ మోహన్ రెడ్డి, ప్రధాని మోదీ, అమిత్ షా వద్ద ప్రతిసారి మెడలు వంచుకొని నిల్చుంటుంటే ప్రజలు సిగ్గు పడుతున్నారని గిడుగు రుద్రరాజు అన్నారు.

AP Congress President Gidugu Rudraraja

AP Congress: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి  (CM Jagan mohan Reddy)  అవినీతిపై సమగ్ర విచారణ చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ (Congress Party) ఏపీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు (Gidugu Rudraraja)  కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నగరంలోని ఇందిరా భవన్‌లో  ఏఐసీసీ కార్యదర్శి మొయిప్పన్‌తో కలిసి గిడుగు రుద్రరాజు మీడియాతో మాట్లాడారు.. ఏపీలో కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు సమన్వయ కమిటీల ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఓరియంటేషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. కడప ఉక్కు ఏమైందని యువత ప్రశ్నిస్తోందని, చక్కెర కర్మాగారానికి అతీగతీ లేదని, నాలుగేళ్ల పాలనలో ఎన్ని పరిశ్రమలు తెచ్చారని సీఎం జగన్ మోహన్ రెడ్డిని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షిణించాయని, ఎంతో రద్దీగా ఉన్న ప్రాంతాల్లో హత్య జరుగుతున్నాయని, ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు.

AAP Offer to Congress: కాంగ్రెస్ పార్టీకి ఆమ్ ఆద్మీ పార్టీ బంపర్ ఆఫర్.. మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో పోటీ చేయమంటూ ప్రకటన

పులివెందులలో దళితులను హత్య చేసినా చర్యలు లేవని, సీఎం సొంత జిల్లాలో హత్య, మారణహోమాలు జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని రుద్రరాజు ప్రశ్నించారు. ప్రజలకోసం పని చేయాల్సిన పోలీసులు ప్రజాప్రతినిధులకు తోత్తులుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. నిధులను, ఏపీకి ప్రత్యేక హోదాను సాధిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్.. నాలుగేళ్లలో ఏమీ సాధించలేక పోయారని విమర్శించారు. అనునిత్యం జగన్ మెడలు వంచుకొని మోడీ, అమిత్ షాల వద్ద నిల్చుంటుంటే ప్రజలు సిగ్గు పడుతున్నారని రుద్రరాజు అన్నారు.

Yoga On Moving Train : కదులుతున్న రైలుపై యోగా చేసిన విద్యార్ధులు .. అరెస్ట్ చేసిన పోలీసులు

ప్రత్యేక హోదాతోనే రాష్ట్ర పురోభివృద్ధి సాధ్యమని రుంద్రరాజు అన్నారు. అనేక అంశాలపై, బిల్లులపై కేంద్రానికి వైసీపీ మద్దతు ఇచ్చిందని.. మరి ప్రత్యేక హోదా ఎందుకు సాధించలేక పోయిందని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి అవినీతి పరుడని అమిత్ షా, నడ్డా ఆరోపించారని, వారి ఆరోపణల ప్రకారమే సీఎం జగన్ అవినీతిపై సమగ్ర విచారణ చేపట్టాలి కేంద్రాన్ని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు డిమాండ్ చేశారు. అనేక పథకాలను కాంగ్రెస్ పార్టీ తీసుకోచ్చిందని, సంక్షేమ రాష్ట్రం కాంగ్రెస్‌తోనే సాధ్యమని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పాత పెన్షన్ విధానాన్ని తీసుకొస్తామని, చేస్తామని చెబితే చేసి చూపించే పార్టీ కాంగ్రెస్ అని అన్నారు.

 

ఏఐసీసీ కార్యదర్శి మొయిప్పన్‌ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ ప్రధాని చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. మతోన్మాదాన్ని పోత్సహిస్తున్న బీజేపీని తరమికొట్టే రోజు దగ్గర్లోనే ఉందని అన్నారు. దేశంలో మతతత్వ దాడులు పెరిగిపోయాయని కేంద్రం ప్రభుత్వంపై విమర్శలు చేశారు.