ఏపీలో తగ్గుతున్న పాజిటీవ్ కేసులు, పెరుగుతున్న డిశ్చార్జ్ కేసులు

  • Publish Date - September 26, 2020 / 06:15 PM IST

AP coronavirus Update: కరోనా పాజిటీవ్ కేసుల్లో ఏపీ నిలకడ చూపిస్తోంది. రెండువారాల క్రితం వరకు రోజుకు పదివేల చొప్పున కేసులు నమోదైతే, ఈ కేసులు నెమ్మదిగా తగ్గుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 75,990 టెస్ట్‌లు చేయగా, 7,293 మందికి పాజిటీవ్‌గా నిర్ధారణ అయ్యింది. అంటే మరోరోజూ పాజిటీవ్‌కేసుల్లో కొంత తగ్గుదల.

24 గంటల్లో 9,125 మంది పూర్తిగా రికవరీ అయ్యారు. అంటే, కొత్తగా వచ్చిన కేసులుకన్నా, ఇంటికెళ్లినవాళ్లే ఎక్కువ.

కోవిడ్‌తో ప్రకాశంలో పది మంది, చిత్తూరు, కడపలో 8 చొప్పున, కృష్ణలో 6, విశాఖలో ఐదుగురు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో నలుగురు చొప్పున, గుంటూరు, నెల్లూరులో ముగ్గురు చొప్పున, అనంతపూర్, శ్రీకాకుళంలో ఇద్దరుచొప్పున, కర్నూలు, విజయనగరంలో ఒక్కొక్కరు చనిపోయారు.