AP Coronavirus Cases Updates : ఏపీలో కరోనా విలయం.. ఆగని మరణాలు.. కేసులు

  • Publish Date - September 3, 2020 / 07:06 PM IST

AP Coronavirus Cases Updates : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విలయ తాండవం చేస్తోంది. రోజురోజుకీ కరోనా కేసులు వేల సంఖ్యలో నమోదవు తున్నాయి. కరోనా కేసులతో పాటు మరణాలు కూడా అదే స్థాయిలో నమోదవుతున్నాయి. జాతీయ స్థాయిలో పాజిటివిటీ రేటులోనూ ఏపీ రెండో స్థానంలోకి వెళ్లింది.



గడిచిన 24 గంటల్లో (ర్యాపిడ్ యాంటిజెన్) కిట్లతో సాంపిల్స్ పరీక్షించగా.. ఏపీలో కొత్తగా 10,199 కరోనా కేసులు నమోదయ్యాయి. గురువారం నమోదైన కేసులతో కలిపి ఏపీలో మొత్తంగా 4, 65,730 కరోనా కేసులకు చేరాయి. ఈ ఒక్క రోజే కరోనాతో 75 మంది వరకు చనిపోయారు. ఇప్పటివరకు ఏపీలో కరోనా మరణాల సంఖ్య 4200కి చేరింది.

ప్రస్తుతం ఏపీలో లక్షా 3 వేల 701 యాక్టివ్ కేసులున్నాయి. గడిచిన 24 గంటల్లో 9,499 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకూ ఏపీలో 39,05,775 శాంపిల్స్ పరీక్షించారు.. అలాగే 3 లక్షల 57 వేల 829 మంది కరోనా నుంచి రికవరీ అయ్యారు.



ఏపీలో పలు జిల్లాల్లోనూ కరోనా కేసుల తీవ్రత ఎక్కువగానే ఉంది.. ఒక్కో జిల్లాలో కరోనా మరణాలు నమోదయ్యాయి.. కోవిడ్ సోకిన వారిలో తూర్పుగోదావరి జిల్లాలో 10, చిత్తూరు 9మంది, గుంటూరు 9మంది, అనంతపురం జిల్లాలో ఏడుగురు మృతి చెందారు.

కృష్ణా 7గురు, పశ్చిమగోదావరి జిల్లాలో 7గురు, నెల్లూరు ఆరుగురు, కడప 5, కర్నూలు జిల్లాలో నలుగురు మృతి చెందారు. శ్రీకాకుళం 4, ప్రకాశం 3, విశాఖ, విజయనగరం జిల్లాల్లో ఇద్దరు మృతి చెందారు.

ట్రెండింగ్ వార్తలు