Degree-English Medium : ఏపీలో ఇకపై డిగ్రీ కోర్సులన్నీ ఇంగ్లీష్ మీడియంలోనే..

ఆంధ్రప్రదేశ్‌లో ఇకపై అన్ని డిగ్రీ కోర్పులు ఆంగ్లంలోనే కొనసాగనున్నాయి. వచ్చే విద్యాసంవత్సరం నుండే రాష్ట్ర ప్రభుత్వం ఈ విధానాన్ని అమలులోకి తీసుకురానుంది. ఇప్పటికే అన్ని ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ కళాశాలకు ఆ మేరకు అదేశాలను జారీచేశారు.

AP Degree-English Medium : ఆంధ్రప్రదేశ్‌లో ఇకపై అన్ని డిగ్రీ కోర్సులు ఇంగ్లీష్ మీడియంలోనే  కొనసాగనున్నాయి. వచ్చే విద్యాసంవత్సరం నుంచే రాష్ట్ర ప్రభుత్వం ఈ విధానాన్ని అమలులోకి తీసుకురానుంది. ఇప్పటికే అన్ని ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ కళాశాలకు అదేశాలను జారీచేశారు. తెలుగు మాధ్యమంలో ఇప్పటివరకు కొనసాగిన బోధన ఇకపై ఇంగ్లీష్‌‌లోనూ కొనసాగించాల్సి ఉంటుంది. ప్రస్తుతం డిగ్రీ విద్యనభ్యసిస్తున్న తెలుగుమీడియం విద్యార్దులకు ఎప్పటిలానే తెలుగులోనే బోధన ఉంటుంది.

2021-22 విద్యాసంవత్సరం లో కొత్తగా చేరే విద్యార్ధులకు ఇంగ్లీష్ మీడియంలో బోధన జరుగుతుంది. లాంగ్వేజ్ కోర్సులు మినహా, ఇతర విభాగాల కోర్సులను ఆంగ్ల మాధ్యమంలోకి మార్చేందుకు ఈనెల 28లోపు ఉన్నత విద్యామండలికి ఆయా కళాశాలలు ప్రతిపాదనలు సమర్పించాల్సి ఉంది. ప్రతిపాదనలు పరిశీలించిన అనంతరం ఆయా కాలేజీలకు  కోర్సుల నిర్వాహణకు అనుమతులను మంజూరు చేయనున్నారు.

ఇప్పటికే దీనికి సంబంధించి ప్రభుత్వం నోటిఫికేషన్ సైతం జారీచేసింది. రానున్న విద్యాసంవత్సరం నుండి నాలుగు సంవత్సరాల అండర్ గ్రాడ్యుయేట్ హానర్స్ ప్రోగ్రాముల కోసం దరఖాస్తులను ఇంగ్లీష్‌లో అభ్యసించేందుకు మాత్రమే అనుమతించనున్నారు.

ట్రెండింగ్ వార్తలు