Deputy CM Pawan Kalyan
Pawan Kalyan : ఏపీలో పల్లె సమస్యలపై ఫోకస్ చేశారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. పంచాయితీరాజ్ అధికారులతో రివ్యూ చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. పల్లెల్లో పరిపాలన సులభతరం చేసేందుకు కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గ్రామ పంచాయితీల క్లస్టర్ విధానంలో మార్పులు చేపట్టి కొత్త మార్గదర్శకాలను రూపొందించాలని ఆదేశించారు.
కమిటీ సూచనల ఆధారంగా పల్లె పాలనలో మార్పులకు శ్రీకారం చుట్టనుంది ప్రభుత్వం. గ్రామ పంచాయితీల్లో కొత్త క్లస్టర్ల విభజన, గ్రేడ్ల కేటాయింపుపైన కమిటీ ప్రభుత్వానికి సిఫారసులు చేయనుంది. పంచాయితీ రాజ్ నుంచి నలుగురు ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు కానుంది. జిల్లా ఒక యూనిట్ ప్రాతిపదికన రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉన్న పంచాయితీల ఆదాయం, జనాభా ప్రాతిపదికన జిల్లాల కలెక్టర్లు ఇచ్చిన నివేదికలను కమిటీ పరిశీలిస్తోంది.
Also Read : విశాఖ సాగర తీరంలో బొత్స రాజకీయ ఎత్తులు.. వచ్చే ఎన్నికల్లో తన కొడుకును బరిలోకి దింపే ప్లాన్?
వీటిని కమిటీ పరిశీలించిన తర్వాత పంచాయితీల క్లస్టర్, గ్రేడ్ల విభజనకు సంబంధించిన సిఫార్సులను ప్రభుత్వానికి నివేదించనుంది కమిటీ. దీన్ని అనుసరించి గ్రేడ్ల ప్రకారం పంచాయితీ, సచివాలయ సిబ్బందిని పంపిణీ చేయడానికి మార్గదర్శకాలను రూపొందిస్తారు.
Also Read : లోకేశ్ డిప్యూటీ సీఎం కావాలంటున్న సైకిల్ పార్టీ నేతలు.. తమ నేతను సీఎంగా చూడాలనుకుంటున్నామన్న జనసేన