Pawan Kalyan : మంత్రి నారా లోకేశ్‎పై డిప్యూటీ సీఎం పవన్ ప్రశంసలు

Deputy CM Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్‌లో విశ్వవిద్యాలయాలను ప్రక్షాళన చేసి రాజకీయాలకు అతీతంగా విద్యారంగ నిపుణులను వీసీలుగా నియమించేందుకు నోటిఫికేషన్ ఇస్తూ లోకేశ్ నిర్ణయం తీసుకున్నారు.

Deputy CM Pawan Kalyan Praises Minister Nara Lokesh

Deputy CM Pawan Kalyan : ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌కు రాష్ట్ర డీప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో విశ్వవిద్యాలయాలను ప్రక్షాళన చేసి రాజకీయాలకు అతీతంగా విద్యారంగ నిపుణులను వీసీలుగా నియమించేందుకు నోటిఫికేషన్ ఇస్తూ లోకేశ్ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై స్పందించిన పవన్.. విద్యాశాఖలో సాధికారత దిశగా కీలక నిర్ణయాలు తీసుకున్నారని లోకేష్‌ను ప్రశంసించారు.

విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలకు ప్రాధాన్యత ఇచ్చి, ర్యాంకింగ్స్ మెరుగుపర్చడమే లక్ష్యమని లోకేశ్ అన్నారు. ప్రొఫెసర్ల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని, ఈ నెల 28న తుదిగడువుగా పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో యూనివర్సిటీలను ప్రక్షాళన చేస్తున్నామని మంత్రి లోకేశ్ తెలిపారు.

Read Also : TPCC Working President : టీ కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పోస్టుకు ఫుల్లు గిరాకీ!