Pawan Kalyan: ఆ సమయం ఆసన్నమైంది..! తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన పవన్ కల్యాణ్

తిరుమల లడ్డూ వివాదంపై జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ట్విటర్ లో ఓ సంస్థ ఫిర్యాదు చేస్తూ పెట్టిన పోస్టుకు ..

AP Deputy CM Pawan Kalyan

Tirupati Laddu Controversy on Pawan Kalyan reacted: తిరుమల లడ్డూ వివాదంపై జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ట్విటర్ లో ఓ సంస్థ ఫిర్యాదు చేస్తూ పెట్టిన పోస్టుకు పవన్ కల్యాణ్ రిప్లయ్ ఇచ్చారు. బాధ్యతులపై తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని పవన్ చెప్పారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాందంలో జంతువుల కొవ్వు (చేప నూనె, పందికొవ్వు, గొడ్డు మాంసం కొవ్వు) కలిపినట్లు వెలుగులోకి రావడంతో అందరి మనోభావాలను దెబ్బతీసింది. వైసీపీ హయాంలో ఏర్పాటు చేసిన టీటీడీ బోర్డు ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. బాధ్యులపై సాధ్యమైనంత కఠిన చర్యలు తీసుకోవడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందని పవన్ కల్యాణ్ అన్నారు.

Also Read : Tirumala Laddu: శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రమణ దీక్షితులు సంచలన వ్యాఖ్యలు

దేశంలోని అన్ని ఆలయాల్లో జరిగే అంశాల పర్యవేక్షణకు (దేవాలయాల అపవిత్రత, దేవాలయల భూ సమస్యలు, ఇతర ధార్మిక పద్దతులకు సంబంధించిన అనే సమస్యలకు పరిష్కారం చూపేలా) జాతీయ స్థాయిలో సనాతన ధర్మరక్షణ బోర్డు ఏర్పాటు చేయాల్సిన సమయం ఆలసన్నమైందని పవన్ కల్యాణ్ అభిప్రాయ పడ్డారు. దీనిపై అన్ని వర్గాల వారితో జాతీయ స్థాయిలో చర్చ జరగాలి. సనాతన ధర్మానికి ఏ రూపంలో ముప్పు వచ్చినా మనమంతా కలిసికట్టుగా నిర్మూలించాలని పవన్ కల్యాణ్ తన ట్విటర్ ఖాతాలో పేర్కొన్నారు.