Peedika Rajanna Dora : ఏ క్షణమైనా ఎన్నికలు రావొచ్చు- ఏపీ డిప్యూటీ సీఎం రాజన్న దొర కీలక వ్యాఖ్యలు

ప్రజలకు మంచి జరిగే విధంగా రేపు ఎన్నికల్లో మరోసారి జగన్‌ను ముఖ్యమంత్రి చేయాలనేది తమ లక్ష్యమని, ఆ ఆలోచనతోనే తాము పని చేస్తున్నామని రాజన్న దొర వ్యాఖ్యానించారు. Peedika Rajanna Dora - Elections

Peedika Rajanna Dora - Elections

Peedika Rajanna Dora – Elections : ఏపీలో ఇంకా ఎన్నికలకు 8 నెలల సమయం ఉంది. కానీ అప్పుడే ఎన్నికల హీట్ కనిపిస్తోంది. అన్ని పార్టీలు ఎన్నికలకు రెడీ అయిపోయాయి. గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. అధికార, ప్రతిపక్షాల నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. సై అంటే సై అంటూ కయ్యానికి కాలు దువ్వుతున్నారు నాయకులు. ఈసారి గెలుపు మాదంటే మాదే అంటూ ఎవరికి వారు ధీమాగా ఉన్నారు. ఇదిలా ఉంటే.. ముందస్తు ఎన్నికలపైనా మరోవైపు చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో ఏ క్షణమైనా ఎన్నికలు రావొచ్చని కొందరు నేతలు అంటున్నారు. ఈ వ్యాఖ్యలతో రాజకీయ వేడి మరింత పెరిగింది.

తాజాగా ఎలక్షన్స్ గురించి ఏపీ డిప్యూటీ సీఎం రాజన్న దొర హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఎన్నికలు ఏ క్షణమైనా రావొచ్చనే ఆలోచనతో తామంతా పని చేస్తున్నామని వెల్లడించారు. ఎన్నికలు వస్తాయని తమ పార్టీ పెద్దలు చెప్పడం లేదన్న ఆయన.. ఎన్నికలు రేపు వచ్చినా రెడీగా ఉండాలి, సిద్ధంగా ఉండాలి అనే ఆలోచనతో ఫైట్ చేస్తున్నామన్నారు.

Also Read..Bonda Uma : వైసీపీ 175కి 175 సీట్లు గెలిస్తే మా పార్టీని మూసేస్తాం : బోండా ఉమ సంచలన వ్యాఖ్యలు

ప్రజలకు మంచి జరిగే విధంగా రేపు ఎన్నికల్లో మరోసారి జగన్‌ను ముఖ్యమంత్రి చేయాలనేది తమ లక్ష్యమని, ఆ ఆలోచనతోనే తాము పని చేస్తున్నామని రాజన్న దొర వ్యాఖ్యానించారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు తాము ఇప్పటి నుంచే సిద్ధపడుతున్నామని రాజన్న దొర పేర్కొన్నారు.