AP Deputy Speaker Kolagatla : స్విమ్మింగ్‌పూల్‌లో కోలగట్ల విన్యాసం .. వైరల్ అవుతున్న వీడియో

నిత్యం ప్రజల్లో ఉండే రాజకీయ నాయకులు ఖాళీ సమయం దొరికితే ఏం చేస్తారు అనే క్యూరియాసిటీ చాలామందిలో ఉంటుంది. ఏపీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి స్విమ్ చేస్తారు.. అందులో విచిత్రం ఏముంది అనుకోకండి.. ఆయన స్విమ్మింగ్ పూల్‌లో గంట సేపు వేసిన ఆసనం వైరల్ అవుతోంది మరి.

AP Deputy Speaker Kolagatla

AP Deputy Speaker Kolagatla : ప్రజా, ప్రభుత్వ కార్యక్రమాల్లో నిత్యం బిజీగా ఉండే నేతలకు ఖాళీ సమయం దొరకడమే అరుదు. అలా దొరికిన కాస్త సమయంలో ఏం చేస్తారు? అంటే ..ఒక్కొక్కరూ ఒక్కోలా గడుపుతుంటారు. ఓ నాయకుడు అయితే స్విమ్మింగ్ పూల్‌లోకి దిగి ఈత కొడతారు. ఇందులో పెద్ద విశేషం ఏం ఉంది అనుకోకండి. ఆయన స్విమ్మింగ్ పూల్‌లోకి దిగి ఆసనాలు వేస్తుంటే మీరు ఔరా అంటారు. ఇంతకీ ఎవరా నేత? ఏ ఆసనాలు వేస్తారు.. అంటే..

Buddha Venkanna : జగన్‌తో లూలూచీ పడ్డారా? లేక భయపడుతున్నారా..?: ముద్రగడకు బుద్దా వెంకన్న లేఖ

ప్రభుత్వంలో పనిచేసే నాయకులు క్షణం తీరిక లేకుండా నిత్యం ప్రజల్లో ఉంటూ బిజీగా గడుపుతూ ఉంటారు. ఇక వారు ఒత్తిడిని తగ్గించుకోవాలంటే అప్పుడప్పుడు ఇష్టమైన పనులు చేస్తూ ఉంటారు. అలా కాస్తే ఉపశమనం పొందుతారు. ఏపీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి కాస్త ఖాళీ సమయం చిక్కితే ఏం చేస్తారో తెలిస్తే ఆశ్చర్యపోతారు. స్విమ్మింగ్ పూల్‌లో ఆయన చేసే అరుదైన ఫీట్ చూస్తే ఔరా అంటారు.

AP Politics : జగన్ మాస్టర్ ప్లాన్.. బాబు పవన్ తట్టుకోగరా

నేషనల్ స్విమ్మింగ్ డే సందర్భంగా విజయనగరంలోని ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఉన్న స్విమ్మింగ్ పూల్‌లో కోటగట్ల కాసేపు స్విమ్మింగ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన నీటిలో గంట సేపు వేసిన శవాసనం అందరినీ అలరించింది. కాళ్లూ, చేతులు కదపకుండా, వెల్లకిలా పడుకుని, గంటపాటు కదలకుండా నీటిపై తేలియాడుతూ కోలగట్ల ఆసనం వేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. కోలగట్ల అరుదైన విన్యాసం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.