Buddha Venkanna : జగన్‌తో లూలూచీ పడ్డారా? లేక భయపడుతున్నారా..?: ముద్రగడకు బుద్దా వెంకన్న లేఖ
ఏపీలో లేఖాస్త్రాలు పొలిటికల్ హీట్ ను పెంచుతున్నాయి. ముద్రగడ పవన్ కు లేఖ..బుద్ధా వెంకన్న ముద్రగడకు లేఖ ఇలా లేఖలు పొలిటికల్ హీట్ ను పెంచుతున్నాయి. ఇక విమర్శలు, ప్రతి విమర్శలు మామూలుగా లేవు.

buddha venkanna..mudragada
Buddha Venkanna’s letter to Mudragada : జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. లేఖలో పవన్ విమర్శలు చేశారు. ఈ లేఖ ఏపీలో పొలిటికల్ హీట్ పెంచినట్లుగా కనిపిస్తోంది. ఎందుకంటే టీడీపీ నేత బుద్దా వెంకన్న ముద్రగడకు బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో బుద్దా ముద్రగడపై విమర్శలు వేశారు. కాపులకు జగన్ ప్రభుత్వం ఏమీ లేదంటూనే..జగన్ తో మీరు లాలూచీ పడ్డారా? లేక భయపడుతున్నారా? అని ప్రశ్నించారు.
Mudragada Letter : పవన్ కల్యాణ్‌కు ముద్రగడ పద్మనాభం లేఖ, ఏమన్నారంటే..
కాపుల కోసం ఏమీ చేయని జగన్ ను మీరు ఎందుకు విమర్శించటలేదు? అని ప్రశ్నించారు. కాపు ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని చంద్రబాబును విమర్శిస్తే మేం చూస్తు ఊరుకోం అన్నారు. మీరు రాలే ప్రతీలేఖకు బదులిస్తామన్నారు. ఎదుటివారిని ప్రశ్నించే ముందు జగన్ కాపులకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ కాపులకు ఏం చేశారో చెప్పి అప్పుడు ప్రశ్నించండీ..అంతే తప్ప ఇష్టమొచ్చినట్లుగా విమర్శలు చేస్తే ఊరుకోం అని హెచ్చరించారు.