Andhra Pradesh : శాంతి భద్రతల విషయంలో ఎవరినీ ఉపేక్షించేది లేదు-డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డి

రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో ఎవరినీ ఉపేక్షించేదిలేదని డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డి అన్నారు.

Ap Dgp Rajendranath Reddy

Andhra Pradesh :  రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో ఎవరినీ ఉపేక్షించేది  లేదని డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డి అన్నారు. ఈరోజు ఆయన రాష్ట్ర హోం శాఖమంత్రి తానేటి వనితను సచివాలయంలో మర్యాద పూర్వకంగా కలిసారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ డీజీపీ రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ పక్కాగా అమలు చేయాలని హోం మంత్రితో జరిగిన సమావేశంలో నిర్ణయించినట్లు తెలిపారు.

పోలీస్ స్టేషన్ కు   వచ్చే ఫిర్యాదులు వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని హోం మంత్రి సూచించినట్లు డీజీపీ చెప్పారు. నెల్లూరు కోర్టులో జరిగిన దొంగతనంపై సాక్ష్యాలు ఆధారంగా ముందుకు వెళతామని.. విచారణలో వాస్తవాలని బట్టి ముందుకు వెళ్ళనున్నట్లు చెప్పారు.

ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విచారణ చేపట్టామని… ఎవరి వద్దనైనా సాక్ష్యాలు ఉంటే ఇవ్వాలని ఆయన కోరారు. ఆలూరు ఘటనలో 82 మందిని అరెస్ట్ చేసామని శాంతి భధ్రతల పరిరక్షణలో కఠినంగా వ్యవహరిస్తామని ఆయన అన్నారు. పాడేరు, మన్యం జిల్లాలలో పోలీసు కార్యాలయాలను 15రోజుల్లో పూర్తిచేస్తామని రాజేంద్రనాధ్ రెడ్డి వివరించారు.

Also Read : Best Mobile Phones : రూ. 10వేల లోపు తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఇవే..!