Best Mobile Phones : రూ. 10వేల లోపు తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఇవే..!
Best Mobile Phones : తక్కువ బడ్జెట్‌లో అద్భుతమైన ఫీచర్లతో కొత్త స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి రిలీజ్ అయ్యాయి. ఏయే స్మార్ట్ ఫోన్లు ఏయే ఫీచర్లతో పదివేల లోపు ధరకే అందుబాటులో ఉన్నాయంటే.

Best Mobile Phones Top 5 Best Mobile Phones Under Rs 10000 Budget April 2022
Best Mobile Phones : 2022 ఏడాది సమ్మర్ సీజన్‌లో తక్కువ బడ్జెట్‌లో అద్భుతమైన ఫీచర్లతో కొత్త స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి రిలీజ్ అయ్యాయి. ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజాలు కూడా అందరి కస్టమర్లకు చేరువయ్యేలా తక్కువ బడ్జెట్ ధరకే సరికొత్త స్మార్ట్ ఫోన్లను అందిస్తున్నాయి. ఆకర్షణీయమైన ఫీచర్లతో స్మార్ట్ ఫోన్ వినియోగదారులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. హైఎండ్ వెర్షన్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ల కంటే తక్కువ బడ్జెట్ స్మార్ట్ ఫోన్లపై ఎక్కువగా ఫోకస్ పెడుతున్నాయి. స్మార్ట్ ఫోన్ కంపెనీలు ఇటీవల మార్కెట్లోకి రిలీజ్ చేసిన పదివేల లోపు బడ్జెట్ స్మార్ట్ ఫోన్లు చాలానే ఉన్నాయి. అందులో తక్కువ ధర ఎక్కువ ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్లను సేకరించి మీకోసం అందిస్తున్నాం. వీటిలో మీకు నచ్చిన బ్రాండ్ స్మార్ట్ ఫోన్ ఎంచుకుని కొనుగోలు చేయొచ్చు.. ఏయే స్మార్ట్ ఫోన్లు ఏయే ఫీచర్లతో పదివేల లోపు ధరకే అందుబాటులో ఉన్నాయో ఓసారి చూద్దాం..
Redmi 9 Smartphone :
ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమీ సబ్ బ్రాండ్ రెడ్‌మి నుంచి 9 సిరీస్ మోడల్ ఎప్పుడో రిలీజ్ అయింది. పది వేల లోపు బడ్జెట్ స్మార్ట్ ఫోన్ కోసం చూసేవారికి ఇదే బెస్ట్ ఫోన్ అని చెప్పవచ్చు. 6.53 అంగుళాల HD డిస్‌ప్లేతో వచ్చిన ఈ డివైజ్.. ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో G35 SoC ప్రాసెసర్‌తో వచ్చింది. Redmi 9 డివైజ్ వెనకవైపు 13MP ప్రైమరీ కెమెరా, డెప్త్ సెన్సర్‌తో 2MP కెమెరాను అమర్చారు. ఫ్రెంట్ సెల్ఫీల కోసం 5MP కెమెరా కూడా అందిస్తోంది. 5,000mAh బ్యాటరీని కూడా కలిగి ఉంది. 10వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే ఈ స్మార్ట్ ఫోన్.. 4GB/64GB స్టోరేజీ వేరియంట్ ధర రూ. 8,999తో మార్కెట్లో అందుబాటులో ఉంది.

Redmi 9 Smartphone
Realme Narzo 50i :
ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్‌మి నుంచి వచ్చిన Narzo సిరీస్‌లో ఇదే బెస్ట్ వెర్షన్.. 2021 సెప్టెంబర్‌లోనే Narzo 50i మోడల్ మార్కెట్లో లాంచ్ అయింది. పదివేల లోపు కెమెరా ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్ కోరుకునే యూజర్ల కోసం కంపెనీ ఈ మోడల్ ప్రవేశపెట్టింది. ఇందులో ఆక్టాకోర్ యూనిసాక్ 9863 ప్రాసెసర్‌తో వచ్చింది. 6.5 అంగుళాల LCD మల్టీ టచ్ డిస్‌ప్లే అమర్చారు. వెనుకవైపు 8MP AI కెమెరా అమర్చారు. ఫ్రంట్ సైడ్ స్మార్ట్ ఫోన్ 5MP AI సెల్ఫీ కెమెరాను అమర్చారు. 5,000mAh బ్యాటరీతో వచ్చింది. 2GB RAM/32GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 7,499, 4GB/64GB వేరియంట్ ధర రూ. 8,999లతో మార్కెట్లో అందుబాటులో ఉంది. మీకు దీని ఫీచర్లు నచ్చితే కొనుగోలు చేసుకోవచ్చు.
JioPhone Next :
దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో, గూగుల్ భాగస్వామ్యంతో కొత్త జియో నెక్స్ట్ స్మార్ట్ ఫోన్ రిలీజ్ అయింది. తక్కువ ధరకే 4G సపోర్టుతో పాటు ప్రీమియం ఫీచర్లతో మార్కెట్లో లాంచ్ అయింది. ఈ స్మార్ట్ ఫోన్లో స్నాప్‌డ్రాగన్ 215QM ప్రాసెసర్‌ను అమర్చారు. ఈ డివైజ్ వెనుక వైపు 13MP రియర్ కెమెరా, ఫ్రంట్ సైడ్ 8MP ఆటో ఫోకస్ కెమెరాలతో వచ్చింది. 5.45 అంగుళాల HD డిస్‌ప్లే అందించారు. స్టోరేజీ విషయానికి వస్తే.. 2GB RAM/32GB స్టోరేజీ సపోర్టు చేస్తుంది. అంతేకాదు.. మెమొరీని 512GB వరకు ఎక్స్ ఫ్యాండ్ చేసుకోవచ్చు. 3,500mAh బ్యాటరీ సామర్థ్యంతో రన్ అవుతుంది. Jio Phone Next ధర రూ.6,499గా కంపెనీ వెల్లడించింది.

Jiophone Next
Samsung Galaxy A03 :
ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ గెలాక్సీ నుంచి A సిరీస్ స్మార్ట్ ఫోన్లలో ఇదొకటి.. రూ.10వేల రేంజ్ ధరలో స్మార్ట్ ఫోన్ కోసం చూసేవారికి శాంసంగ్ మోడళ్లలో ప్రస్తుతం ఈ స్మార్ట్ ఫోన్ A03 మోడల్ ఒకటి అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ వెనుకభాగంలో 48MP ప్రధాన కెమెరా, డెప్త్ సెన్సర్‌తో 2MP కెమెరాను అందించారు. ఆక్టా కోర్ 1.6 గిగాహెడ్జ్ ప్రాసెసర్‌ను కూడా అందించారు. 5000mAh బ్యాటరీ సామర్థ్యంతో వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.7,999లకు మార్కెట్లో అందుబాటులో ఉంది.

Samsung Galaxy A03
Poco C31 :
పోకో బ్రాండ్.. ఇది కూడా చైనా బ్రాండే.. అయినా బడ్జెట్ రేంజ్ స్మార్ట్ ఫోన్లలో ఇదొకటి.. ఇప్పటికే Poco నుంచి వచ్చిన C సిరీస్‌లో C31 మోడల్ అందుబాటులో ఉంది. పదివేల లోపు ధరలో కొనుగోలు చేసేవారికి Poco C31 మోడల్ అందుబాటులో ఉంది. 6.53 అంగుళాల HD+ డిస్‌ప్లేతో వచ్చింది. మీడియాటెక్ హీలియో G35 ప్రాసెసర్‌తో వచ్చిన ఈ డివైజ్.. ఇంటర్నల్ మెమొరీని 512GB వరకు ఎక్స్ ఫ్యాండ్ చేసుకోవచ్చు. అంతేకాదు.. వెనుక వైపు 13MP మెయిన్ కెమెరాతో పాటు 2 MP కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీల కోసం 5MP కెమెరాను కూడా అందించారు. 5000mAh బ్యాటరీతో వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ ఒకసారి ఛార్జ్ చేస్తే.. రెండు రోజుల పాటు బ్యాకప్ అందిస్తుంది. స్టోరేజీ విషయానికి వస్తే.. 3GB+32GB వేరియంట్ ధర రూ.8,499లకు అందుబాటులో ఉంది.

Poco C31
Read Also : Chinese Smartphone Makers : భారత్‌లో ఫోన్ల తయారీకి 3 చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజాల ప్లాన్..!