AP EAPCET Results Released: ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు వచ్చేశాయ్.. విడుదల చేసిన మంత్రి బొత్స సత్యనారాయణ

ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను విజయవాడలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు.

AP EAPCET Results

AP EAPSET Results: ఏపీ ఈఏపీసెట్ -2023 (AP EAPSET ) ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను విజయవాడలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ (Minister Botsa Satyanarayana) విడుదల చేశారు. ఇంజినీరింగ్ (Engineering) ప్రవేశాలకు 76.32శాతం మంది అర్హత సాధించగా, వ్యవసాయ కోర్సు (Agriculture course) ల్లో ప్రవేశాలకు 89.65శాతం అర్హత సాధించారు. మే 15 నుంచి 19 వరకు ఇంజనీరింగ్ స్ట్రీమ్, మే 22, 23 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. అనంతపురం జేఎన్టీయూ- ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో ఏపీ ఈఏపీసెట్‌ పరీక్షలు జరిగాయి.

AP EAPCET : జూన్ 14న ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు విడుదల

ఏపీ ఈఏపీసెట్ పరీక్షలకు మొత్తం 3,38,739 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు. వీరిలో ఇంజినీరింగ్ విభాగంలో 2,24, 724మంది పరీక్ష రాయగా, ఇంజినీరింగ్ విభాగంలో ప్రవేశాలకు 1,71, 514మంది అర్హత సాధించారు. వ్యవసాయ విభాగంలో 90, 573 మంది విద్యార్థులు పరీక్ష రాయగా, 81,203 మంది అర్హత సాధించారు. ఫలితాల విడుదల సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ఈఏపీసెట్ ఫలితాల్లో బాలురతో పోల్చితే బాలికలు నాలుగు శాతం అదనంగా అర్హత సాధించారని చెప్పారు.

AP EAPCET-2023: మే 15 నుంచే ఏపీ ఈఏపీసెట్-2023.. వివరాలివిగో

ఈసారి ఇంటర్ మార్కుల వెయిటేజీ ఇచ్చి ర్యాంకులు ప్రకటిస్తున్నామని మంత్రి చెప్పారు. ఇంజినీరింగ్ విభాగంలో ప్రథమ ర్యాంక్ చల్లా ఉమేష్ వరుణ్ 158 మార్కులు సాధించారని అన్నారు. అదేవిధంగా ఇంజినీరింగ్ విభాగంలో ద్వితీయ ర్యాంక్ అభినవ్ చౌదరి , తృతీయ ర్యాంక్ నందిపాటి సాయి దుర్గా రెడ్డి సాధించినట్లు మంత్రి బొత్స తెలిపారు.